Dell Technologies | చిరు వ్యాపారులు, ఉద్యోగుల కోసం డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లభ్యం..
Dell Technologies | చిరు వ్యాపారులు, ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెల్ టెక్నాలజీస్ సంస్థ భారత మార్కెట్లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. డెల్ ప్రొ ఎసెన్షియల్ 14, డెల్ ప్రొ ఎసెన్షియల్ 15 పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో వరుసగా 14, 15 ఇంచుల డిస్ప్లేలు ఉన్నాయి. పనితీరు, భద్రత, తేలికైన డిజైన్‌కు ప్రాధాన్యమిస్తూ ఈ మోడళ్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Technology | Published On Oct 15, 2026, 5.04 pm IST
Dell Technologies | చిరు వ్యాపారులు, ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెల్ టెక్నాలజీస్ సంస్థ భారత మార్కెట్లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. డెల్ ప్రొ ఎసెన్షియల్ 14, డెల్ ప్రొ ఎసెన్షియల్ 15 పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో వరుసగా 14, 15 ఇంచుల డిస్ప్లేలు ఉన్నాయి. పనితీరు, భద్రత, తేలికైన డిజైన్‌కు ప్రాధాన్యమిస్తూ ఈ మోడళ్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. గత తరం మోడళ్లతో పోలిస్తే కొత్త ల్యాప్‌టాప్‌లు 11 శాతం సన్నగా, 9 నుంచి 16 శాతం వరకు తేలికగా ఉంటాయి. ఇవి సెలెస్టియల్ బ్లూ, ప్లాటినం సిల్వర్ రంగుల్లో లభిస్తాయి. కీబోర్డులోనూ మార్పులు చేశారు. మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడం, డిక్టేషన్, స్క్రీన్‌షాట్ తీసుకోవడం కోసం ప్రత్యేక షార్ట్‌కట్ కీలను అందించారు. మైక్రోఫోన్ మ్యూట్ కీకి ఎల్ఈడీ సూచికను జోడించారు. గత తరం మోడళ్లతో పోలిస్తే టచ్‌ప్యాడ్ పరిమాణాన్ని 6 శాతం పెంచారు.
డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు..
ఈ ల్యాప్‌టాప్‌లలో రెండు రకాల డిస్ప్లే ఎంపికలు ఉన్నాయి. 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో పాటు, 500 నిట్స్ బ్రైట్నెస్ అందించే 2.5కె డిస్ప్లేను ఎంచుకోవచ్చు. వీడియో కాల్స్ కోసం హెచ్డీ లేదా ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరా ఎంపికలు, రెండు మైక్రోఫోన్లు అందించారు. ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేదా ఏఎండీ రైజెన్ 200 సిరీస్ ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయి. గరిష్ఠంగా 64 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌ను ఎంచుకోవచ్చు. అధిక మెమరీ, స్టోరేజ్ అవసరమయ్యే వ్యాపార వినియోగదారులకు ఈ ఎంపికలు ఉపయోగపడనున్నాయి. కనెక్టివిటీ కోసం రెండు యూఎస్బీ టైప్ సి పోర్టులు, రెండు యూఎస్బీ టైప్ ఎ పోర్టులు, హెచ్డీఎంఐ పోర్టు, ఆడియో జాక్ అందించారు. ఇంటెల్ ప్రాసెసర్‌తో వచ్చే మోడళ్లలో ఆర్జే-45 ఈథర్నెట్ పోర్టు కూడా ఉంటుంది.
భద్రతకు సంబంధించి హార్డ్‌వేర్ ఆధారిత ట్రస్టెడ్ ప్లాట్‌ఫామ్ మాడ్యూల్ (టీపీఎం) చిప్‌ను అందించారు. ఫింగర్‌ప్రింట్ రీడర్ లేదా ఎఫ్‌హెచ్‌డీ ఐఆర్ కెమెరా ద్వారా బయోమెట్రిక్ లాగిన్ చేసుకోవచ్చు. కెమెరా కోసం ప్రత్యేక మెకానికల్ షట్టర్‌తోపాటు, ల్యాప్‌టాప్‌ను భద్రపరిచేందుకు సెక్యూరిటీ లాక్ స్లాట్‌ను కూడా ఏర్పాటు చేశారు. డెల్ ప్రొ ఎసెన్షియల్ 14, డెల్ ప్రొ ఎసెన్షియల్ 15 ల్యాప్‌టాప్‌లను ఎంఐఎల్-810హెచ్ ప్రమాణాల ప్రకారం పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి ఈపీఏటీ గోల్డ్ క్లైమేట్ ప్లస్ రిజిస్ట్రేషన్, ఎనర్జీ స్టార్ ధ్రువీకరణలను పొందాయి. ప్యాకేజింగ్ కోసం పూర్తిగా రీసైకిల్ చేసిన లేదా పునరుత్పాదక పదార్థాలను ఉపయోగించినట్లు డెల్ తెలిపింది.
ధరలు, లభ్యత..
ఈ రెండు ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డెల్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెల్ ప్రొ ఎసెన్షియల్ 14 ప్రారంభ ధరను రూ.85,500గా నిర్ణయించారు. డెల్ ప్రొ ఎసెన్షియల్ 15 ప్రారంభ ధర రూ.86,200గా ఉంది.
తాజావార్తలు
- ●Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?
- ●Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
- ●Myntra | ఇన్‌స్టాగ్రామ్‌లో మింత్రా కొత్త ఫీచర్.. క్రియేటర్లకు భారీ ఆదాయం..
- ●Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్
- ●Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ - సందీప్‌కిషన్ కరికాల షురూ
- ●BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్

Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?

Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

Myntra | ఇన్‌స్టాగ్రామ్‌లో మింత్రా కొత్త ఫీచర్.. క్రియేటర్లకు భారీ ఆదాయం..

Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్




