Token 26 AI Hackathon | సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కార్స్24 బంపర్ ఆఫర్.. రూ.20 లక్షలు గెలుచుకునే అవకాశం..
Token 26 AI Hackathon | యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ కార్స్24 తమ రంగాన్ని పూర్తిగా మార్చేశామని, యూజ్డ్ కార్ మార్కెట్ ప్లేస్ నుంచి ఏఐ ఆధారిత ఆపరేటింగ్ కంపెనీగా మారామని తెలియజేసింది. ఈ సందర్బంగా కంపెనీ రెవెన్యూ పర్ ఎంప్లాయీ 50 శాతం మేర పెరిగిందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మార్పు పట్ల ప్రజల్లో మరింత ప్రచారం కల్పించేందుకు గాను కార్స్24 నడుం బిగించింది.
Technology | Published On May 18, 2026, 2.59 pm IST
Token 26 AI Hackathon | యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ కార్స్24 తమ రంగాన్ని పూర్తిగా మార్చేశామని, యూజ్డ్ కార్ మార్కెట్ ప్లేస్ నుంచి ఏఐ ఆధారిత ఆపరేటింగ్ కంపెనీగా మారామని తెలియజేసింది. ఈ సందర్బంగా కంపెనీ రెవెన్యూ పర్ ఎంప్లాయీ 50 శాతం మేర పెరిగిందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మార్పు పట్ల ప్రజల్లో మరింత ప్రచారం కల్పించేందుకు గాను కార్స్24 నడుం బిగించింది. అందులో భాగంగా ఔత్సాహికులకు ప్రత్యేకంగా టోకెన్ 26 అనే సరికొత్త ఏఐ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇది పూర్తిగా వ్యక్తిగత పోటీయేనని, ఇందులో గెలిచిన విజేతకు ఏకంగా రూ.20 లక్షల నగదు బహుమతి అందిస్తామని తెలిపింది. కాగా ఏఐ ఆధారిత ఆపరేటింగ్ కంపెనీగా మారిన నేపథ్యంలో కార్స్ 24 ఓపెన్ఏఐకి చెందిన ఏఐ మోడల్స్‌ను వినియోగిస్తోంది. అలాగే అమెజాక్‌కు చెందిన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, చాట్ జీపీటీ స్టోర్‌లో ఇటీవలే లాంచ్ చేసిన వెహికల డిస్కవరీ యాప్ ద్వారా తమ సిస్టమ్స్‌లో పూర్తిగా ఏఐని మరింత లోతుగా ఉపయోగిస్తున్నట్లు కార్స్ 24 తెలియజేసింది.
72 గంటలపాటు హ్యాకథాన్..
టోకెన్ 26 హ్యాకథాన్‌ను ఏకబిగిన 72 గంటల పాటు నిర్వహిస్తారు. మే 28 నుంచి 30 మధ్య ఢిల్లీలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో కార్స్24కు చెందిన లైవ్ ఆపరేషన్లకు చెందిన ప్రొడక్షన్ రెడీ ఏఐ సమస్యలను ఔత్సాహికులు పరిష్కరించాల్సి ఉంటుంది. ఏఐ ఆధారిత ప్రైసింగ్, రిస్క్ అసెస్ మెంట్, వాహన ఇన్‌స్పెక్షన్ వంటి టాస్కులపై ఫోకస్ ఉంటుందని కంపనీ తెలిపింది. ఈ హ్యాకథాన్‌లో గ్రూప్స్ ఏమీ లేవు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఎవరికి వారు పాల్గొనాలి. మొత్తం బాధ్యత ఒక్కరిపైనే ఉంటుంది. పోటీలో పాల్గొనే వారికి కనీసం ఒక సంవత్సరం హ్యాండ్స్ ఆణ్ షిప్పింగ్ అనుభవం ఉండాలి. గెలిచిన ఒక్క వ్యక్తికి మాత్రమే రూ.20 లక్షలు ఇస్తారు. దీన్ని విన్నర్ టేక్స్ ఆల్ క్యాష్ ప్రైజ్‌గా ఇవ్వనున్నారు. ఇతర ప్రైజ్‌లు, బహుమతులు ఏవీ లేవు. అందువల్ల పోటీలో చివరకు నంబర్ వన్ స్థానంలో నిలవాలి.
ఏమేం సదుపాయాలు కల్పిస్తారు..
ఈ పోటీలో పాల్గొనేవారికి ఓపెన్ఏఐ ఫ్రంటియర్ మోడల్స్, ఎలెవన్ ల్యాబ్స్ వాయిస్ ఏఐ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూట్ క్రెడిట్స్, కార్స్24 ఏఐ లీడర్‌షిప్ మెంటార్‌షిప్ వంటి సదుపాయాలను అందిస్తారు. టోకెన్ 26కి సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులను కార్స్24 వెబ్‌సైట్‌లో ఆహ్వానిస్తున్నారు. అక్కడ నమోదైన దరఖాస్తుల్లో 50 అప్లికేషన్లను ఎంపిక చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. పోటీలో ఆ 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సందర్భంగా కార్స్24 ఫౌండ్, సీఈవో విక్రమ్ చోప్రా మాట్లాడుతూ ఏఐని కంపెనీలో ఒక ఉపకరణంలా కాకుండా మొత్తం ఆపరేటింగ్ మోడల్‌గా రీబిల్డ్ చేశారరని, దీని వల్ల రెవెన్యూ పర్ ఎంప్లాయీ పెరుగుదలలో ఫలితం కనిపిస్తుందని చెప్పారు. ఈ దశాబ్దంలో నిజంగా గెలిచే కంపెనీలు ఏఐని అంగీకరించినవే అని, ఏఐ చుట్టూనే తిరిగి నిర్మాణమైనవి అని తెలిపారు. టోకెన్ 26 ద్వారా అలాంటి ఇంజినీర్లను కనుగొనాలనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






