Bajaj Pulsar N250SS | బజాజ్ పల్సర్ ఎన్250ఎస్ఎస్ విడుదల.. కొత్త ఫీచర్లు ఇవే..
Bajaj Pulsar N250SS | భారత మార్కెట్లో బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ ఎన్250ఎస్ఎస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,59,406గా నిర్ణయించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పల్సర్ ఎన్250కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు సహా పలు కీలక మార్పులను ఇందులో చేసింది.
Technology | Published On Oct 21, 2026, 5.10 pm IST
Bajaj Pulsar N250SS | భారత మార్కెట్లో బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ ఎన్250ఎస్ఎస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,59,406గా నిర్ణయించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పల్సర్ ఎన్250కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు సహా పలు కీలక మార్పులను ఇందులో చేసింది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ అప్డేట్లను ప్రవేశపెట్టింది. బజాజ్ పల్సర్ ఎన్250ఎస్ఎస్ డిజైన్ విషయంలో తన పల్సర్ కుటుంబానికి చెందిన స్పోర్టీ రూపాన్ని కొనసాగించింది. బాడీపై పదునైన గీతలు, ఆకర్షణీయమైన డిజైన్ దీని ప్రత్యేకతగా నిలుస్తాయి. కొత్త పెయింట్ ఆప్షన్లు, తాజా గ్రాఫిక్స్‌ను జోడించడం ద్వారా బైక్ రూపానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. హెడ్‌ల్యాంప్ సెటప్ మాత్రం ఇప్పటికే ఉన్న ఎన్250లో కనిపించే డిజైన్‌కు దగ్గరగా ఉంటుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్‌లో కీలక అప్డేట్లు..
కొత్త పల్సర్ ఎన్250ఎస్ఎస్లో 249 సీసీ సామర్థ్యం కలిగిన అప్డేటెడ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ వ్యవస్థలతోపాటు నాలుగు వాల్వ్‌ల హెడ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 25 హెచ్‌పీ శక్తిని, 22 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత ఎన్250లోని 24.5 హెచ్‌పీ శక్తి, 21.5 ఎన్ఎం టార్క్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అయితే, గేర్‌బాక్స్‌లో చేసిన మార్పు మరింత కీలకమైనది. పాత ఐదు గేర్ల గేర్‌బాక్స్ స్థానంలో కొత్తగా ఆరు గేర్ల గేర్‌బాక్స్‌ను అందించారు. దీంతో రైడింగ్ సమయంలో గేర్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్లచ్‌ను ఉపయోగించకుండా గేర్లను పైకి మార్చేందుకు వీలుగా స్పోర్ట్స్ షిఫ్టర్ ఫీచర్‌ను ప్రామాణికంగా అందించారు. ఈ క్విక్‌షిఫ్టర్ గేర్ల మార్పును వేగంగా, సులభంగా చేయడంలో సహాయపడుతుంది.
5 ఇంచుల టీఎఫ్టీ స్క్రీన్.. గూగుల్ మ్యాప్స్ సదుపాయం..
కొత్త పల్సర్ ఎన్250ఎస్ఎస్లో ఫీచర్ల పరంగా కూడా పలు మార్పులు చేశారు. గతంలో అందించిన ఎల్సీడీ డిస్ప్లే స్థానంలో 5 ఇంచుల టీఎఫ్టీ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిరరింగ్ సదుపాయం ఉండడంతో రైడర్లు ప్రయాణ సమయంలో నావిగేషన్ వివరాలను స్క్రీన్‌పై చూసుకోవచ్చు. ల్యాప్ టైమర్, వాహనానికి సంబంధించిన పత్రాలను భద్రపరుచుకునే సదుపాయం కూడా ఈ డిస్ప్లేలో ఉన్నాయి. బైక్‌లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీని కూడా ప్రవేశపెట్టారు. ఇది ఏబీఎస్ మోడ్లతో కలిసి పనిచేస్తూ ఈటీబీ రైడింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. అయితే, ఒక్కో రైడింగ్ మోడ్‌లో ఉండే నిర్దిష్ట సెట్టింగ్‌ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇతర ఫీచర్లలో భాగంగా సర్దుబాటు చేసుకునే లివర్లు, యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ స్విచ్‌ను అందించారు. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు వెనుక వచ్చే వాహనాలను అప్రమత్తం చేయడానికి పానిక్ బ్రేక్ అలర్ట్ సదుపాయాన్ని కూడా జోడించారు. ఈ ఫీచర్ అత్యవసర బ్రేకింగ్ సమయంలో హెచ్చరికను అందించేందుకు ఉపయోగపడుతుంది.
పోటీ ఎవరితోంటే?
సాధారణ పల్సర్ ఎన్250తో పోలిస్తే కొత్త ఎన్250ఎస్ఎస్ ధర రూ.14వేలు ఎక్కువగా ఉంది. అదనపు ఫీచర్లు, ఆరు గేర్ల గేర్‌బాక్స్, స్పోర్ట్స్ షిఫ్టర్, టీఎఫ్టీ డిస్ప్లే వంటి అప్డేట్లు ఈ ధర పెరుగుదలకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. భారత మార్కెట్లో ఈ బైక్ ప్రధానంగా హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్, సుజుకి జిక్సర్ 250 మోడళ్లతో పోటీ పడనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!
- ●CM Revanth Reddy | మైసూరు దసరా ఉత్సవాలు.. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- ●Akhilesh Yadav Slams BJP | అక్రమాలకు పాల్పడితే జైలుకే: విద్యాశాఖ అధికారులకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ఆంక్షలు అమల్లోకి
- ●ECINet Platform Centralisation | ఈసీఐనెట్ ప్లాట్‌ఫామ్‌పై సంచలన నివేదిక: రాష్ట్రాల యాక్సెస్ ఎప్పుడైనా బంద్ చేయొచ్చు!
- ●Mallikarjun Kharge | ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు : ఖర్గే

TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!

CM Revanth Reddy | మైసూరు దసరా ఉత్సవాలు.. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Akhilesh Yadav Slams BJP | అక్రమాలకు పాల్పడితే జైలుకే: విద్యాశాఖ అధికారులకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ఆంక్షలు అమల్లోకి






