త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ప్ర‌స్తుత సీట్ల‌లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయొచ్చు : ఖ‌ర్గే

Mallikarjun Kharge | డీలిమిటేష‌న్ (delimitation) ప్ర‌క్రియ కోసం వేచి చూడ‌కుండా ప్రస్తుతం పార్ల‌మెంట్‌లో అందుబాటులో ఉన్న స్థానాల ఆధారంగానే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను (Womens Reservation Bill) తక్షణమే అమ‌లు చేయొచ్చ‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Oct 21, 2026, 5.00 pm IST

Mallikarjun Kharge | ప్ర‌స్తుత సీట్ల‌లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయొచ్చు : ఖ‌ర్గే
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. డీలిమిటేష‌న్ (delimitation) ప్ర‌క్రియ కోసం వేచి చూడ‌కుండా ప్రస్తుతం పార్ల‌మెంట్‌లో అందుబాటులో ఉన్న స్థానాల ఆధారంగానే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను (Womens Reservation Bill) తక్షణమే అమ‌లు చేయొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అంశంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గిలో మీడియాతో ఖ‌ర్గే మాట్లాడారు. "ప్ర‌స్తుతం స‌భ‌లోని సంఖ్యా బ‌లం ఆధారంగానే మూడింట ఒక వంతు సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించొచ్చు. అయితే, ప్ర‌భుత్వం అలా చేయ‌డం లేదు. ఈ విష‌యంలో మిమ్మ‌ల్ని ఎవ‌రు అడ్డుకుంటున్నారు..?" అంటూ మోదీ స‌ర్కార్‌ను ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను కాంగ్రెస్ ఇప్ప‌టికే స‌మ‌ర్థించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం పొందిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, దాని అమ‌లును భ‌విష్య‌త్తులో జ‌రిగే జ‌నాభా గ‌ణ‌న‌, పున‌ర్విభ‌జ‌న‌ల‌తో ముడిపెడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్రతిపక్షాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రభుత్వం ఈ అంశాన్ని వాడుకుంటోందని ఖర్గే ఆరోపించారు.

ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాలి..

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపైనా ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ 2023లో బీజేపీ ప్ర‌భుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా ఎన్నికల అధికారులకు తప్పులు చేసే వెసులుబాటు కల్పించారని మండిప‌డ్డారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంట‌నే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈవీఎంల‌ను పూర్తిగా ర‌ద్దు చేసి మ‌ళ్లీ బ్యాలెట్ పేప‌ర్ ప‌ద్ధ‌తిలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు.

మీరు కూడా ఎంపీనే.. ప్రధాని మోదీపై విమర్శలు

ప్ర‌ధాని మోదీపై ఖ‌ర్గే తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ప్రధాని మోదీ సరిగ్గా వినియోగించుకోవడం లేదని, కేవలం తన రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు రాసే లేఖలకు ప్రధాని నేరుగా సమాధానం ఇవ్వకుండా, మంత్రుల‌తో సమాధానాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రతిపక్ష నాయకులను, పార్టీలను అవమానించడమేనని మండిపడ్డారు. ప్రధాని మోదీ సైతం రాజ్యాంగానికి అతీతులు కాదని పేర్కొన్నారు. ఆయ‌న కూడా 543 మందిలో ఒక ఎంపీ మాత్రమేనని ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు సహించరని భ‌విష్య‌త్తులో త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చరించారు.

Also Read..

ఫ్రాన్స్‌లో ఏం జ‌రుగుతోందో చూస్తున్నాం క‌దా..?

మైసూరులో ద‌స‌రా ఉత్స‌వాలు.. హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్లు.. ధరలెంతంటే?

Advertisement
Advertisement