Tata Motors EMI Offer | టాటా మోటార్స్ అద్భుతమైన ఆఫర్.. నెలకు రూ.4,999 ఈఎంఐకే కార్..!
Tata Motors EMI Offer | కారు కొనాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో చాలా మంది కారును కొనాలనే కలను నిజం చేసుకోలేకపోతుంటారు. ఇక కేవలం కొద్ది మంది మాత్రమే పూర్తి స్థాయిలో నగదును ఒకేసారి చెల్లించి కార్లను కొంటారు.
Technology | Published On Dec 20, 2025, 10.34 am IST
Tata Motors EMI Offer | కారు కొనాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో చాలా మంది కారును కొనాలనే కలను నిజం చేసుకోలేకపోతుంటారు. ఇక కేవలం కొద్ది మంది మాత్రమే పూర్తి స్థాయిలో నగదును ఒకేసారి చెల్లించి కార్లను కొంటారు. ఇది కూడా అందరికీ వీలయ్యే పనికాదు. అలాగే చాలా మంది ఈఎంఐ విధానంలోనూ కార్లను కొంటుంటారు. కానీ నెల నెలా ఈఎంఐ మొత్తం చెల్లించాలంటే ఆర్థికంగా పెను భారం పడుతుంది. అది కూడా సామాన్యులతో అయ్యే పనికాదు. కానీ సామాన్యులు కూడా సులభమైన వాయిదాల్లో కార్లను కొనుగోలు చేసేలా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నూతన ఫైనాన్స్ ఆప్షన్లను వినియోగదారులకు అందిస్తోంది. దీని ప్రకారం కార్‌ను నెలకు కేవలం రూ.5వేల ఈఎంఐకే సొంతం చేసుకోవచ్చు.
నెలకు ఈఎంఐ రూ.4,999 మాత్రమే..
టాటా మోటార్స్ సంస్థ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా కార్లపై వినూత్న రీతిలో ఫైనాన్సింగ్ సదుపాయాలను అందిస్తోంది. నెలకు కేవలం రూ.4,999 ఈఎంఐ చెల్లిస్తే చాలు, కార్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాటా మోటార్స్‌కు చెందిన పలు ఎంపిక చేసిన కార్ మోడల్స్‌పై వారు ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ కింద వినియోగదారులు మొత్తం 10 కార్లలో ఏ కారును అయినా ఎంచుకోవచ్చు. ఇక ఈ ఆఫర్‌కు గాను ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. అందువల్ల కార్ కొనాలనుకునే వినియోగదారులు తక్కువ ఈఎంఐ చెల్లించాలనుకుంటే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా పలు పెట్రోల్, ఈవీ కార్లను తక్కువ ఈఎంఐలకే అందిస్తున్నారు.
పీవీ రేంజ్, ఈవీ రేంజ్‌లకు..
టాటా మోటార్స్ అందిస్తున్న ఈ ఆఫర్‌ను బెలూన్ స్కీమ్ ఆప్షన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా పీవీ రేంజ్ అయితే 84 నెలల వరకు ఈఎంఐ వ్యవధి ఉంటుంది. అదే ఈవీ రేంజ్ అయితే 120 నెలల వరకు ఈఎంఐ వ్యవధి ఉంటుంది. ఇక ఈ ఆఫర్‌లో అతి తక్కువ ఈఎంఐ కింద నెలకు రూ.4,999 మాత్రమే చెల్లించేలా టాటాకు చెందిన టియాగో కారును సొంతం చేసుకోవచ్చు. ఇంకాస్త ఎక్కువ మొత్తం చెల్లిస్తామనుకుంటే నెలకు రూ.14,555 ఈఎంఐ చెల్లిస్తూ మరో భిన్న కార్‌ను కూడా ఈ ఆఫర్‌లో భాగంగా పొందవచ్చు.
నెలాఖరు వరకు మాత్రమే..
ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు కొనుగోలు చేసే పలు భిన్న కార్లకు గాను చాలా తక్కువ మొత్తంలో ఈఎంఐ లను చెల్లించే సదుపాయాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తరువాత కార్‌ను కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తించదు. కనుక ఆలోగానే కార్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంట్లో టియాగో కార్‌ను నెలకు రూ.4,999 ఈఎంఐకు పొందవచ్చు. అలాగే టైగొర్ కార్ ఈఎంఐ రూ.5,999, పంచ్ కార్ ఈఎంఐ రూ.5,999, ఆల్ట్రోజ్ కార్ ఈఎంఐ రూ.6,777, నెక్సాన్ కారు ఈఎంఐ రూ.7,666, కర్వ్ కార్ ఈఎంఐ రూ.9,999గా ఉంది. అలాగే ఈవీ మోడల్స్‌లో టియాగో, పంచ్, నెక్సాన్, కర్వ్ మోడల్స్‌కు వరుసగా నెలకు ఈఎంఐలు రూ.5,999, రూ.7,999, రూ.10,999, రూ.14,555 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుందని టాటా మోటార్స్ తెలియజేసింది.
సంబంధిత వార్తలు

India EV sales 2026 | భారత్‌లో దూసుకుపోతున్న ఈవీ సేల్స్.. పడిపోయిన ఓలా మార్కెట్ వాటా
మే 2, 2026

Apple Car Key | ఇకపై యాపిల్ ఐఫోన్ లేదా వాచ్ ఉంటే చాలు.. కారును అన్ లాక్ చేసి స్టార్ట్ చేయవచ్చు..
ఏప్రిల్ 21, 2026

Tata Punch EV Facelift | ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల ప్రయాణం..! పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఈవీని మార్కెట్లోకి వదిలిన టాటా మోటార్స్..!
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



