Tata Punch EV Facelift | ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల ప్రయాణం..! పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఈవీని మార్కెట్‌లోకి వదిలిన టాటా మోటార్స్..!
Tata Punch EV Facelift | టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో శనివారం విడుదల చేసింది. ఈ కొత్త మోడల్, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఈవీ ధర రూ.9.69లక్షల (ఎక్స్ షోరూం) నుంచి మొదలుకానుంది.
Tata Punch EV Facelift | టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో శనివారం విడుదల చేసింది. ఈ కొత్త మోడల్, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఈవీ ధర రూ.9.69లక్షల (ఎక్స్ షోరూం) నుంచి మొదలుకానుంది. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 30 kWh వేరియంట్ సిటీ ఏరియాలో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. 40 kWh వేరియంట్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది.
రియల్ టైమ్‌లో రేంజ్ సుమారు 355 కిలోమీటర్లు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నుంచి 80 శాతం వరకు కేవలం 26 నిమిషాల్లో ఛార్జ్ చేసే వీలుంటుంది. 15 నిమిషాల్లో 135 కిలోమీటర్ల రేంజ్ టాప్ అప్ సాధ్యమని కంపెనీ పేర్కొంది. ఇక వాహనదారులకు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని కంపెనీ ఇవ్వనున్నది. ఇంటి వద్ద, కార్యాలయాల్లో వాడుకునేందుకు వాల్ బాక్స్ ఛార్జర్, హైవేల్లో వాడేందుకు డీసీ ఫాస్ట్ చార్జర్‌తో వస్తుంది. ఫేస్‌లిఫ్ట్ డిజైన్ మరింత స్లీక్, ఆధునికంగా, బోల్డ్‌గా మార్చింది. ముందు భాగంలో కొత్త బంపర్, పెద్ద ఎయిర్ డామ్, వెర్టికల్ హెడ్‌లైట్స్ ఉన్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్స్, యూఎస్‌వీ ఫీల్ కోసం క్లాడింగ్, స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. కేబిన్‌లో వైట్-గ్రే థీమ్, డ్యువల్-టోన్ డ్యాష్‌బోర్డ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, సన్‌రూఫ్, వాయిస్ కంట్రోల్ సౌకర్యం, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం మార్చనున్నాయి.
సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీస్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, హిల్ హోల్డ్ అసిస్టెంట్, పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు సైతం ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ప్లే ఫీచర్స్ ఉన్నాయి. మిగతా డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ తరహాలోనే ఉంటుంది. కొత్తగా 3 రంగులతో కలిపి మొత్తం ఏడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త పంచ్ మార్కెట్‌లో ఇతర వాహనాలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పంచ్ వాహనం మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కఠిన పోటీగా నిలుస్తోంది. సిట్రోయెన్ ఈసీ3, ఎంజీ విండ్‌సోర్, టాటా నెక్సాన్‌తో పోలిస్తే.. పంచ్ ఈవీ కంపాక్ట్ ఎస్‌యూవీ కావడం, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్స్ ప్రత్యేకతను తీసుకువచ్చింది. బాస్ మోడల్, లైఫ్‌టైమ్ వారంటీ మరింత ఆకర్షణీయంగా మార్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






