త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kawasaki Ninja 650 2026 | క‌వాస‌కి నింజా 650 నూత‌న మోడ‌ల్ ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌ర రూ.7.91 ల‌క్ష‌లు..

Kawasaki Ninja 650 2026 | ప్ర‌ముఖ ఆటోమొబైల్ త‌యారీ సంస్థ క‌వాసకి మ‌రో నూత‌న ద్విచ‌క్ర వాహ‌నాన్ని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. నింజా సిరీస్‌లో నింజా 650 పేరిట 2026 మోడ‌ల్‌ను ఆవిష్క‌రించింది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.7.91 ల‌క్ష‌లుగా ఉంది.

S

Technology | Published On Dec 24, 2025, 9.30 pm IST

Kawasaki Ninja 650 2026 | క‌వాస‌కి నింజా 650 నూత‌న మోడ‌ల్ ఆవిష్క‌ర‌ణ‌.. ధ‌ర రూ.7.91 ల‌క్ష‌లు..
Advertisement

Kawasaki Ninja 650 2026 | ప్ర‌ముఖ ఆటోమొబైల్ త‌యారీ సంస్థ క‌వాసకి మ‌రో నూత‌న ద్విచ‌క్ర వాహ‌నాన్ని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. నింజా సిరీస్‌లో నింజా 650 పేరిట 2026 మోడ‌ల్‌ను ఆవిష్క‌రించింది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.7.91 ల‌క్ష‌లుగా ఉంది. ఈ వాహ‌నానికి సంబంధించి ఇంట‌ర్నేష‌న‌ల్ మోడ‌ల్స్‌ను ప‌లు భిన్న‌ర‌కాల రంగుల్లో రిలీజ్ చేశారు. కానీ ఇండియ‌న్ మోడ‌ల్ ను మాత్రం కేవ‌లం లైమ్ గ్రీన్ క‌ల‌ర్‌లోనే లాంచ్ చేశారు. దీనికి వైట్‌, బ్లూ క‌ల‌ర్ల‌లో గ్రాఫిక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ఇదే వాహ‌నానికి చెందిన మ్యాట్ గ్రే, బ్లాక్ పెయింట్ క‌ల‌ర్ మోడ‌ల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాహ‌నానికి 4.3 ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి స్మార్ట్ ఫోన్‌ను అనుసంధానం చేసుకోవ‌చ్చు.

ఈ వాహ‌నానికి ఎల్ఈడీ లైటింగ్ ఇచ్చారు. టూ మోడ్స్ ట్రాక్ష‌న్ కంట్రోల్‌, డ్యుయ‌ల్ థ్రాటిల్ వాల్వ్‌లు, ఏబీఎస్ వంటి అత్యాధునిక స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఈ వాహ‌నంలో 649 సీసీ ఇంజిన్ ఉంది. ఇది ప్యారెలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కాగా 8000 ఆర్‌పీఎంతో 67 బీహెచ్‌పీని అందిస్తుంది. 64 ఎన్ఎం పీక్ టార్క్ ల‌భిస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్‌మిష‌న్‌ను ఇచ్చారు. ముందు భాగంలో 300ఎంఎం డ్యుయ‌ల్ ట్విన్ డిస్క్‌లు ఉండ‌గా, వెనుక భాగంలో 220 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్‌ను ఇచ్చారు. 17 ఇంచ్ అలాయ్ వీల్స్‌ను ఈ వాహ‌నం క‌లిగి ఉంది.

క‌వాస‌కి నింజా 650 వీల్‌బేస్ 1410 ఎంఎంగా ఉంది. దీని వ‌ల్ల వాహ‌న‌దారుల‌కు స్టేబుల్ రైడ్ ల‌భిస్తుంది. గ్రౌండ్ క్లియ‌రెన్స్‌ను 130 ఎంఎంగా ఇచ్చారు. 15 లీట‌ర్ ఫ్యుయ‌ల్ ట్యాంక్ ఉంది. సీట్ ఎత్తు 790 ఎంఎం ఉంటుంది. ఈ వాహ‌నం బ‌రువు 196 కిలోలు కాగా సుల‌భంగా హ్యాండిల్ చేసేలా డిజైన్‌ను ఇచ్చారు. అలాగే ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్ స‌స్పెన్ష‌న్ ఉండ‌గా, వెనుక వైపు మోనో షాక్ స‌స్పెన్ష‌న్‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల వాహ‌నంపై రైడింగ్ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఈ వాహ‌నం ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్న‌ట్లు కంపెనీ తెలియ‌జేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement