త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bajaj Pulsar 150 2026 | ప‌ల్స‌ర్ 150 స‌రికొత్త 2026 మోడ‌ల్‌ను ఆవిష్క‌రించిన బ‌జాజ్‌.. ధ‌ర ఎంతంటే..?

Bajaj Pulsar 150 2026 | టూవీల‌ర్ వాహ‌న‌దారుల‌కు ఎంతో ప్రియ‌మైన బ‌జాజ్ ప‌ల్స‌ర్ 150 వాహ‌నానికి గాను నూత‌న 2026 మోడ‌ల్‌ను ఆ కంపెనీ తాజాగా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఈ వాహ‌నాన్ని డీల‌ర్ల వ‌ద్ద టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంచ‌గా, కొత్త మోడ‌ల్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

S

Technology | Published On Dec 25, 2025, 10.57 am IST

Bajaj Pulsar 150 2026 | ప‌ల్స‌ర్ 150 స‌రికొత్త 2026 మోడ‌ల్‌ను ఆవిష్క‌రించిన బ‌జాజ్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Bajaj Pulsar 150 2026 | టూవీల‌ర్ వాహ‌న‌దారుల‌కు ఎంతో ప్రియ‌మైన బ‌జాజ్ ప‌ల్స‌ర్ 150 వాహ‌నానికి గాను నూత‌న 2026 మోడ‌ల్‌ను ఆ కంపెనీ తాజాగా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఈ వాహ‌నాన్ని డీల‌ర్ల వ‌ద్ద టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంచ‌గా, కొత్త మోడ‌ల్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్‌గా ఈ మోడ‌ల్‌ను లాంచ్ చేశారు. వినియోగ‌దారులు ఎప్పుడెప్పుడా అని ఈ మోడ‌ల్ కోసం ఎదురు చూస్తుండ‌డం విశేషం. కాగా ఈ స‌రికొత్త మోడ‌ల్ ప‌ల్స‌ర్ 150 ప్రారంభ ధ‌ర ఎక్స్ షోరూం ప్ర‌కారం రూ.1.09 ల‌క్ష‌లుగా ఉంది. ఇక ఇందులోనే మ‌రో రెండు వేరియెంట్ల‌ను కూడా బ‌జాజ్ లాంచ్ చేసింది. ప‌ల్సర్ 150 ఎస్‌డీ యూజీ, ప‌ల్స‌ర్ 150 టీడీ (ట్విన్ డిస్క్‌) యూజీ పేరిట ఈ వేరియెంట్ల‌ను లాంచ్ చేశారు. ఇక వీటి ఎక్స్ షోరూం ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.1.12 ల‌క్ష‌లు, రూ.1.15 ల‌క్ష‌లుగా ఉన్నాయి. ఇవి ప్ర‌స్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

పాత క్లాసిక్ లుక్ అలాగే..

బ‌జాజ్‌కు చెందిన ప‌ల్స‌ర్ 150 ఎప్ప‌టి నుంచో ఆ కంపెనీకి ప్ర‌ధాన టూవీల‌ర్ మోడ‌ల్‌గా ఉంది. అధిక శాతం మంది ఇప్ప‌టికీ వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు. చాలా పురాత‌న బ్రాండ్‌గా కూడా ప‌ల్స‌ర్ 150 పేరుగాంచింది. రాను రాను వినియోగ‌దారుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. ప‌ల్స‌ర్ 150కి గాను ఇప్ప‌టికీ అమ్మ‌కాలు అలాగే ఉన్నాయి. ఇక కొత్త మోడ‌ల్‌కు చాలా స్వ‌ల్ప మార్పులు చేశారు. ప్ర‌ధాన భాగం వ‌ర‌కు డిజైన్ అలాగే ఉంది. కొత్త ప‌ల్సర్ 150 వాహ‌నానికి పాత త‌ర‌హా క్లాసిక్, మ‌స్కుల‌ర్ లుక్‌ను అలాగే ఉంచారు. అందువ‌ల్ల కేవ‌లం కాస్త డిజైన్ మారిన‌ట్లు అనిపిస్తుంది. మొత్తం లుక్ అలాగే ఉంది. ఇక ఎల్ఈడీ లైట్ల‌ను కాస్త అప్‌డేట్ చేయ‌గా ట‌ర్న్ సిగ్న‌ల్ ఎల్ఈడీల‌ను కూడా కొద్దిగా మార్చారు.

అవే ఫీచ‌ర్లు..

పాత ప‌ల్స‌ర్ 150 ఆకారం, సైజు అలాగే ఉండేలా కొత్త లుక్ వ‌చ్చేలా నూత‌న మోడ‌ల్‌ను తీర్చిదిద్దారు. ఈ క్ర‌మంలోనే ఫ్యుయ‌ల్ ట్యాంక్‌, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్‌, స్ప్లిట్ సీట్ డిజైన్‌, అలాయ్ వీల్స్‌, ఎగ్జాస్ట్ స్టైల్‌ను అలాగే ఉంచారు. ఇక ఇంజిన్ అదే 149.5 సీసీ సామ‌ర్థ్యాన్ని కలిగి ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదు. 13.8 బీహెచ్‌పీని 13.4 ఎన్ఎం టార్క్‌తో అందిస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిష‌న్‌ను ఇచ్చారు. అయితే ప‌ల్సర్ 150ని మ‌రింత మోడ్ర‌న్‌గా తీర్చిదిద్ది నూతన త‌ర‌హా నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ప‌ల్స‌ర్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ తెలియ‌జేసింది. కాగా ప్ర‌స్తుతం రిలీజ్ అయిన నూత‌న మోడ‌ల్ ప‌ల్స‌ర్ 150లో ట్విన్ డిస్క్ మోడ‌ల్‌లో ముందు డిస్క్ 260 ఎంఎం ఉండ‌గా, వెనుక డిస్క్‌ను 230 ఎంఎం గా అందించారు. ఇక సింగిల్ డిస్క్ మోడ‌ల్‌లో వెనుక వైపు మాత్రం 130 ఎంఎం డ్ర‌మ్ బ్రేక్ ఉంటుంది. నూత‌న ప‌ల్స‌ర్ 150 వాహ‌నానికి 17 ఇంచుల అలాయ్ వీల్స్‌ను, ట్యూబ్‌లెస్ టైర్ల‌ను ఇచ్చారు.

2024 నుంచే డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌..

కాగా ప‌ల్స‌ర్ 150 వాహ‌నానికి గాను 2024లోనే బ‌జాజ్ కంపెనీ ప‌లు మార్పులు చేసింది. ముఖ్యంగా డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌ను పూర్తిగా మార్చేసింది. దాన్ని ప‌ల్స‌ర్ ఎన్‌150, ఎన్‌160 మోడ‌ల్స్‌లా తీర్చిదిద్దింది. దీని వల్ల ప్ర‌ధాన‌మైన రైడింగ్ స‌మాచారం, గేర్ పొజిష‌న్‌, రియ‌ల్ టైమ్ ఫ్యుయ‌ల్ వాడ‌కం వివ‌రాలు, యావ‌రేజ్ ఫ్యుయ‌ల్ వినియోగం, డిస్టాన్స్ టు ఎంప్టీ, డిజిట‌ల్ క్లాక్ వంటి స‌మాచారం మొత్తాన్ని ఒకే చోట చూడ‌వ‌చ్చు. అలాగే బ్లూటూత్‌ కనెక్టివిటీని కూడా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్‌ను బ‌జాజ్ అందిస్తున్న బ‌జాజ్ రైడ్ క‌నెక్ట్ యాప్ ద్వారా ప‌ల్స‌ర్ 150 వాహ‌నానికి అనుసంధానం చేయ‌వ‌చ్చు. దీంతో కాల్స్‌, ఇత‌ర నోటిఫికేష‌న్ అల‌ర్ట్స్‌ను వాహ‌నం డిస్‌ప్లేపై పొంద‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ల‌ను 2024 నుంచే ప‌ల్స‌ర్ 150లో అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన మోడల్‌కు కాస్త మెరుగులు దిద్దారు త‌ప్ప పెద్ద‌గా మార్పులు ఏమీ లేవ‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement