త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Day Sale 2025 | విజ‌య్ సేల్స్ లో యాపిల్ ప్ర‌త్యేక సేల్‌.. ఐఫోన్ 17 స‌హా ప‌లు ప్రొడ‌క్ట్స్‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

Apple Day Sale 2025 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొత్త ఐఫోన్లు రిలీజ్ అయితే కానీ పాత ఐఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌రు. కానీ ప్ర‌స్తుతం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఐఫోన్ 17 ను భారీ త‌గ్గింపు ధ‌ర‌కే అందిస్తున్నారు.

S

Technology | Published On Dec 28, 2025, 5.05 pm IST

Apple Day Sale 2025 | విజ‌య్ సేల్స్ లో యాపిల్ ప్ర‌త్యేక సేల్‌.. ఐఫోన్ 17 స‌హా ప‌లు ప్రొడ‌క్ట్స్‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Apple Day Sale 2025 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొత్త ఐఫోన్లు రిలీజ్ అయితే కానీ పాత ఐఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌రు. కానీ ప్ర‌స్తుతం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఐఫోన్ 17 ను భారీ త‌గ్గింపు ధ‌ర‌కే అందిస్తున్నారు. ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ రిటెయిల్ స్టోర్స్ విజ‌య్ సేల్స్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా యాపిల్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 17 ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని విజ‌య్ సేల్స్ తెలియ‌జేసింది. ఇక ఈ సేల్‌లో కేవ‌లం ఈ ఫోన్ మాత్ర‌మే కాకుండా, ప‌లు ఇత‌ర ఐఫోన్లు, యాపిల్ ఉత్ప‌త్తుల‌ను సైతం త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఫోన్లు, ఐప్యాడ్స్‌, మాక్ బుక్స్‌, యాపిల్ వాచ్‌లు, ఇత‌ర యాపిల్ ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఐఫోన్ 17 ఫోన్లపై..

ఈ సేల్‌లో ఐఫోన్ ఎయిర్‌, ఐఫోన్ 17, 16, 15 సిరీస్ ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఫోన్ ఎయిర్ ఫోన్‌ను రూ.94,990 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.1,19,900గా ఉండ‌డం విశేషం. ఇక ఈ ఫోన్‌పై రూ.4వేల వ‌ర‌కు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా ప‌లు కార్డుల‌తో అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ ధ‌ర మ‌రింత‌గా త‌గ్గ‌నుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఫోన్ 17పై కూడా రూ.4వేల ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్ ధ‌ర రూ.82,900 ఉండ‌గా, దీన్ని డిస్కౌంట్ అనంత‌రం రూ.78,900కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఐఫోన్ 17 ప్రొ లాంచింగ్ ధ‌ర రూ.1,34,900 ఉండ‌గా, ఈ ఫోన్ ను ప్ర‌స్తుతం రూ.1,25,490 ధ‌ర‌కు అందిస్తున్నారు. అలాగే రూ.4వేల ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ల‌భిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.1,21,490కి త‌గ్గింది.

ఐఫోన్ 16 సిరీస్ అయితే..

ఇక ఈ సేల్‌లో ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ధ‌ర‌ను రూ.1,49,900 నుంచి రూ.1,38,490కి త‌గ్గించారు. అలాగే బ్యాంక్ డిస్కౌంట్ అనంత‌రం ఈ ఫోన్ ను రూ.1,34,490కి విక్ర‌యిస్తున్నారు. ఇలా ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను విజ‌య్ సేల్స్‌లో పొంద‌వ‌చ్చు. ఇక ఐఫోన్ 16 ఫోన్ ధ‌ర రూ.69,900 నుంచి రూ.60,900కు త‌గ్గ‌గా దీనిపై రూ.3వేల. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ధ‌ర రూ.57,990కి త‌గ్గింది. ఐఫోన్ 16 ప్ల‌స్ ఫోన్ లిస్ట్ అయిన ధ‌ర రూ.69,490 ఉండ‌గా, రూ.5వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ అనంత‌రం దీన్ని రూ.64,490కి విక్ర‌యిస్తున్నారు. ఐఫోన్ 16ఇ ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.59,900 ఉండ‌గా రూ.50,990కి త‌గ్గింది. దీనిపై రూ.4వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్ ధ‌ర రూ.46,990కి త‌గ్గింది.

మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌ల‌పై కూడా..

ఈ సేల్‌లో ఐఫోన్ 15ను రూ.2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అనంత‌రం రూ.49,490 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. అలాగే రూ.9వేల వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌ను కూడా ఇస్తున్నారు. మాక్ బుక్ ఎయిర్ ఎం4 మోడ‌ల్ లిస్టింగ్ ధ‌ర రూ.89,990 ఉండ‌గా, దీనిపై రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ.79,990కి కొన‌వ‌చ్చు. ఇక ఎం2 చిప్ క‌లిగిన మాక్‌బుక్ ఎయిర్ ధ‌ర డిస్కౌంట్ అనంత‌రం రూ.64,990గా ఉంది. అలాగే 11వ జ‌న‌రేష‌న్ ఐప్యాడ్‌ను రూ.30,190కి డిస్కౌంట్ అనంత‌రం విక్ర‌యిస్తున్నారు. ఐప్యాడ్ ఎయిర్ ఎం3 మోడ‌ల్ ధ‌ర రూ.51,490 గా ఉంది. ఐప్యాడ్ ప్రొ ట్యాబ్‌ను ఎం5 చిప్‌తో రూ.89,990కి అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్‌, వ‌న్ కార్డ్‌, ఐడీఎఫ్ ఫ‌స్ఠ్ బ్యాంక్‌, యెస్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కార్డుల‌తో పైన చెప్పిన విధంగా బ్యాంక్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. క‌నుక వినియోగ‌దారులు ఈ ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌స్తుతం ఉప‌యోగించుకోవచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement