త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic AI Claude | కోడ్ అంతా ఏఐ రాస్తే.. మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏం చేయాలి? ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ చీఫ్ అదిరిపోయే రిప్లై

ఈ ఏఐ టూల్ వల్ల అందరి జాబ్స్ పోయే అవకాశం లేదు. ఎంట్రీ లేవల్ జాబ్స్‌పై మాత్రమే ఎక్కువ శాతం ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.

J

Technology | Published On Feb 16, 2026, 5.11 pm IST

Anthropic AI Claude | కోడ్ అంతా ఏఐ రాస్తే.. మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏం చేయాలి? ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ చీఫ్ అదిరిపోయే రిప్లై
Advertisement

Anthropic AI Claude | ఆంత్రోపిక్ ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఏఐ రంగంలో ఇదొక ప్రభంజనం. ఇప్పటి వరకు ఏఐ అంటే కేవలం హ్యూమన్స్‌కి అసిస్టెంట్స్‌గానే ఉంటాయని అనుకున్నాం కానీ.. ఒక హ్యూమన్‌ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్‌లో ఏఐ కూర్చొని మనుషుల కంటే కూడా వంద శాతం బెటర్‌గా పని చేయగలవు, ఎండ్ టు ఎండ్ సర్వీస్ అందివ్వగలవు అని ఆంత్రోపిక్ ఏఐ టూల్ క్లాడ్ నిరూపించింది. ఈ టూల్ మార్కెట్‌లోకి వచ్చిందో లేదో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు బెంబేలెత్తిపోయాయి. స్టాక్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. ఐటీ స్టాక్స్ కుప్పకూలాయి. చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. నూటికి నూరు శాతం కోడింగ్ ఏఐ చేస్తుందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అవసరం ఇక నుంచి ఉండదని ఆంత్రోపిక్ ఏఐ సీఈవో కూడా పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యలో ఓ యూజర్ ఆసక్తికరమైన ప్రశ్నను ఆంత్రోపిక్ సంస్థకు సంధించాడు. అసలు వంద శాతం కోడ్ క్లాడ్ రాస్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏం చేయాలని ప్రశ్నించాడు. ఆ పోస్టుకి ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ హెడ్ బోరిస్ చెర్నీ స్పందించాడు.

కోడింగ్ ఒక పార్ట్ మాత్రమే

కోడింగ్ అనేది సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఒక పార్ట్ మాత్రమే. కోడింగ్ రాస్తే సరిపోదు కదా. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ప్రకారం ఒక ప్రాజెక్ట్ పూర్తవడానికి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ రిక్వైర్‌మెంట్‌ని అనలైజ్ చేయడం, దాన్ని డిజైన్ చేయడం, డిప్లాయి చేయడం, ప్రాజెక్ట్ మెయిన్‌టెనెన్స్, ఏఐ సిస్టమ్స్‌కి ప్రాంప్టింగ్ ఇవ్వడం, కస్టమర్లతో మాట్లాడటం, ఇతర టీమ్స్‌తో కోఆర్డినేట్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారు. ఇంజినీరింగ్ మారుతోంది. గ్రేట్ ఇంజినీర్స్ ఎప్పుడైనా మార్కెట్‌కి అవసరమే.. అంటూ రిప్లయి ఇచ్చాడు.

నిజానికి ఆంత్రోపిక్ వందకు వంద శాతం కోడ్ రాసినా.. దాన్ని ఇంజినీర్లు రివ్యూ చేసి అవుట్‌పుట్‌ని వాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆ కోడ్‌ని మెర్జ్ లేదా డిప్లాయి చేయాల్సి ఉంటుంది. ఏఐ రాసిన కోడ్‌ని ఎలాంటి వాలిడేషన్ లేకుండా ఏ కంపెనీ కూడా డిప్లాయి చేయదు.. అని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే.. ఈ ఏఐ టూల్ వల్ల అందరి జాబ్స్ పోయే అవకాశం లేదు. ఎంట్రీ లేవల్ జాబ్స్‌పై మాత్రమే ఎక్కువ శాతం ప్రభావం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement