త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon AI Store | అమెజాన్‌లో ఏఐ ప్రొడ‌క్ట్స్ కోసం ప్ర‌త్యేకంగా ఏఐ స్టోర్‌.. వాటిని కొన‌డం ఇక ఈజీ..

Amazon AI Store | ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్ లో ఏఐ స్టోర్ అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఏఐ ఆధారిత కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సులభంగా వెదికి కొనుగోలు చేయగలుగుతారు.

S

Technology | Published On Apr 19, 2026, 3.03 pm IST

Amazon AI Store | అమెజాన్‌లో ఏఐ ప్రొడ‌క్ట్స్ కోసం ప్ర‌త్యేకంగా ఏఐ స్టోర్‌.. వాటిని కొన‌డం ఇక ఈజీ..
Advertisement

Amazon AI Store | ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్ లో ఏఐ స్టోర్ అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఏఐ ఆధారిత కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సులభంగా వెదికి కొనుగోలు చేయగలుగుతారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి విభిన్న ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచారు. ఈ ఏఐ స్టోర్‌లో ప్రతి ఉత్పత్తి వినియోగ‌దారుల‌కు నిత్య జీవితంలో ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని అమెజాన్ తెలిపింది. పనితీరు, సమర్థత, విజువల్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, ప‌ర్స‌న‌లైజేష‌న్‌ వంటి అంశాల్లో ఏఐ ఎలా మెరుగైన ప‌నితీరును అందిస్తుందో ఆయా ఉత్ప‌త్తుల‌కు చెందిన వివరాల విభాగంలో పూర్తి స‌మాచారం ఇచ్చారు. దీని వ‌ల్ల ఏఐ స‌హాయంతో ఏ ప్రొడ‌క్ట్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవ‌డం వినియోగ‌దారుల‌కు సుల‌భ‌త‌రం అవుతుంది.

గ‌ణ‌నీయంగా పెరిగిన ఏఐ ఉత్ప‌త్తుల సెర్చ్‌లు..

మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్న ప్ర‌కారం భార‌త్‌లో ఏఐ ఆధారిత ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల ఆస‌క్తి వేగంగా పెరుగుతుంద‌ని తెలుస్తోంది. ఏఐ ఉత్ప‌త్తులపై ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేసేవారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్ర‌తి ఏటా 60 శాతం వృద్ధితో ఏఐ ప్రొడ‌క్ట్స్ సెర్చ్‌లు పెరుగుతున్నాయ‌ని తేలింది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల గురించి చేసే సెర్చ్‌ల సంఖ్య వృద్ధిరేటు 80 శాతం ఉండ‌గా, టీవీల విభాగంలో 40 శాతం పెరిగాయి. వియ‌ర‌బుల్స్ గురించి కూడా ఎక్కువ సెర్చ్‌లు న‌మోద‌వుతున్నాయి. టియ‌ర్‌-2, టియ‌ర్‌-3 సిటీల నుంచి భారీ ఎత్తున సెర్చ్‌లు వ‌స్తున్న‌ట్లు తేలింది. మొత్తంలో సెర్చ్‌ల‌లో ఇవి మూడింట రెండు వంతుల మేర న‌మోద‌వుతున్నాయ‌ని వెల్ల‌డైంది.

ఏఐ ప్రొడ‌క్ట్స్‌ను కొన‌డం ఈజీ..

ఇక అమెజాన్ లాంచ్ చేసిన ఏఐ స్టోర్‌లో ఏఐ ఉత్ప‌త్తులే ఉంటాయి. ఏఐ షాపింగ్ ఎకో సిస్ట‌మ్ కోసం ఈ స్టోర్‌ను లాంచ్ చేసిన‌ట్లు అమెజాన్ తెలిపింది. ముఖ్యంగా ఇందులో ఉండే రూఫ‌స్ అనే ఇన్‌బిల్ట్ ఏఐ ద్వారా వినియోగ‌దారులు తాము కొనాల‌నుకునే ఉత్ప‌త్తుల‌కు చెందిన వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే కొత్త ఉత్ప‌త్తుల‌ను వెద‌క‌వ‌చ్చు. ఇక ఈ స్టోర్‌లో లెన్స్ ఏఐ అనే స‌దుపాయం ఉంది. దీని స‌హాయంతో ప్రొడ‌క్ట్ కు చెందిన ఫొటో యూజ‌ర్ వ‌ద్ద ఉంటే దాన్ని అప్‌లోడ్ చేసి ఆ ఫొటోలోని ప్రొడ‌క్ట్‌ను సెర్చ్ చేయ‌వ‌చ్చు. అలాగే వ్యూ ఇన్ యువ‌ర్ రూమ్ అనే స‌దుపాయం ద్వారా ప్రొడ‌క్ట్‌ను కొనుగోలు చేసే ముందు అది ఇంట్లో ఎలా క‌నిపిస్తుందో వ‌ర్చువ‌ల్ రియాలిటీ ద్వారా చెక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అలాగే రివ్యూ స‌మ్మ‌రీలు, ప్రైస్ హిస్ట‌రీ వంటి స‌దుపాయాలు ఉన్నందున వినియోగ‌దారులు ఉత్ప‌త్తిని కొనుగోలు చేసేముందు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు.

ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు..

అమెజాన్ ఏఐ స్టోర్ లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను సైతం అందిస్తున్నారు. ఈ స్టోర్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 అల్ట్రా 5జి ఫోన్ ధ‌ర త‌గ్గింపు అనంతరం రూ.1,30,999కు ల‌భిస్తుండ‌గా, వ‌న్ ప్ల‌స్ నార్డ్ 6 ఫోన్‌ను రూ.41,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ల్యాప్‌టాప్ విభాగంలో హెచ్‌పీ ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ మోడ‌ల్‌ను రూ.1,71,900కు కొన‌వ‌చ్చు. స్మార్ట్ టీవీల విభాగంలో శాంసంగ్ ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఆ కంపెనీకి చెందిన 55 ఇంచుల విజ‌న్ ఏఐ 4కె క్యూలెడ్ టీవీ ధ‌ర రూ.44,990 గా ఉంది. టాబ్లెట్ విభాగంలో యాపిల్ ఐప్యాడ్ 11 ఇంచుల మోడ‌ల్‌ను రూ.33,900కే కొన‌వ‌చ్చు. స్మార్ట్ వాచ్‌ల‌లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ రూ.39,699కు అందుబాటులో ఉంది. ఈ ఏఐ స్టోర్ ద్వారా వినియోగ‌దారులు ఒకే వేదిక‌పై ఏఐ ఉత్ప‌త్తుల‌ను ప‌రిశీలించి, పోల్చి చూసి, న‌చ్చితే కొనుగోలు చేయ‌వ‌చ్చు. భార‌త మార్కెట్‌లో ఏఐ వినియోగం పెరుగుతున్నందునే ఇక్క‌డి పౌరుల కోసం ఈ స్టోర్‌ను లాంచ్ చేశామ‌ని అమెజాన్ తెలిపింది.

Advertisement
Advertisement