Sugar Stocks | చక్కెర కంపెనీల షేర్లకు భారీ నష్టం.. కేంద్రం నిర్ణయంతో ఇన్వెస్టర్లలో ఆందోళన..
Sugar Stocks | చక్కెర కంపెనీల షేర్లు సోమవారం భారీగా పడిపోయాయి. 2026-27 సరఫరా చక్రంలో ఇథనాల్ కొనుగోళ్ల కోసం చెరకు రసం, చక్కెర సిరప్‌ను ముడి పదార్థాలుగా ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో చక్కెర పరిశ్రమలో ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా డిస్టిలరీ వ్యాపారాలు నిర్వహిస్తున్న చక్కెర మిల్లుల ఆదాయం, లాభాల అంచనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.
Sugar Stocks | చక్కెర కంపెనీల షేర్లు సోమవారం భారీగా పడిపోయాయి. 2026-27 సరఫరా చక్రంలో ఇథనాల్ కొనుగోళ్ల కోసం చెరకు రసం, చక్కెర సిరప్‌ను ముడి పదార్థాలుగా ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో చక్కెర పరిశ్రమలో ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా డిస్టిలరీ వ్యాపారాలు నిర్వహిస్తున్న చక్కెర మిల్లుల ఆదాయం, లాభాల అంచనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం 9.20 గంటల సమయానికి బజాజ్ హిందుస్థాన్ షుగర్ అత్యధికంగా 5.79 శాతం పడిపోయింది. ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ 5.30 శాతం, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ 5.27 శాతం చొప్పున నష్టపోయాయి. శ్రేయ్ రేణుకా షుగర్స్ 4.74 శాతం, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ 3.17 శాతం క్షీణించాయి. బలరాంపూర్ చినీ మిల్స్ 2.79 శాతం, మవానా షుగర్స్ 2.45 శాతం నష్టపోయాయి.
కారణాలేంటి..?
2026-27 సరఫరా చక్రంలో ఇథనాల్ కొనుగోళ్ల కోసం చెరకు రసం, చక్కెర సిరప్‌ను ముడి పదార్థాలుగా ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడమే తాజా పతనానికి ప్రధాన కారణం. ఈ విధానంతో ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడానికి అనుమతి లేకుండా పోవడంతో, చక్కెర కంపెనీలకు కీలకమైన ఆదాయ మార్గం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ నిర్ణయం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ ముడి పదార్థాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, డిస్టిలరీ వ్యాపారాల ద్వారా ఆదాయం పొందుతున్న చక్కెర మిల్లులకు ఇథనాల్ ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచడం, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. సుంకాలు లేకుండా ముడి చక్కెర దిగుమతులకు అనుమతి ఇవ్వడం, వ్యాపారులు నిల్వ చేసుకునే చక్కెర పరిమాణంపై పరిమితులు విధించడం వంటి చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
మిల్లులకు ఆదాయం తగ్గనుందా..
మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో చక్కెర ఆధారిత ఇథనాల్ కొనుగోళ్లను నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నెలకొన్న ఆందోళనలే షేర్ల పతనానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యత పెరిగి, చక్కెర విక్రయ ధరలకు మద్దతు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, అదే సమయంలో చక్కెర మిల్లులకు కీలకమైన ఆదాయ మార్గం మూసుకుపోతుందని వివరించారు. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కొనుగోళ్ల ధరలు తక్కువగా ఉండే అవకాశం కూడా చక్కెర కంపెనీలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని రవి సింగ్ అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో ఈ పరిణామాల వల్ల చక్కెర కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లకు అప్రమత్తత అవసరం..
దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యత పెరగడం, విక్రయ ధరలకు మద్దతు లభించే అవకాశాలు ఒకవైపు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి అవకాశాలు తగ్గడం మరోవైపు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా డిస్టిలరీ వ్యాపారాల ఆదాయం ఎంత మేరకు తగ్గుతుంది? దేశీయ చక్కెర ధరల్లో మెరుగుదల ఆ నష్టాన్ని భర్తీ చేయగలదా? అనే అంశాలు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కీలకంగా మారాయి. రానున్న కాలంలో ప్రభుత్వ విధానాలు, ఇథనాల్ కొనుగోళ్ల ధోరణులు, చక్కెర ధరల కదలికలు ఈ రంగంలోని కంపెనీల పనితీరును ప్రభావితం చేయనున్నాయి.
తాజావార్తలు
- ●Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..
- ●Donald Trump Russia Ukraine War | రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్స్కీకి ఇష్టం లేదు
- ●Denmark Cyber Attack | ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే.. 88 లక్షల రికార్డులు లీక్..
- ●Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
- ●Fire Accident | పాతబస్తీలో అగ్నిప్రమాదం.. బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
- ●Gold Investment | ఈఎంఐ విధానంలో బంగారం కొనవచ్చా.. ఖర్చు ఎంతవుతుంది..?

Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

Donald Trump Russia Ukraine War | రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్స్కీకి ఇష్టం లేదు

Denmark Cyber Attack | ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే.. 88 లక్షల రికార్డులు లీక్..

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు



