Lawrence Bishnoi | బాలీవుడ్ నటులే టార్గెట్.. ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్
Lawrence Bishnoi | దేశంలోనే అత్యంత కుట్రపూరిత గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన లారెన్స్ బిష్ణోయ్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. బాలీవుడ్ (Bollywood) నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)పై కాల్పుల ఘటనతో బిష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ నేపథ్యలో ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.
Lawrence Bishnoi | త్రినేత్ర న్యూస్ : అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బెదిరింపులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. 90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని దావూద్ ఇబ్రహీం, అబు సలేం వంటి అండర్ వరల్డ్ మాఫియా శాసించే పరిస్థితులు ఉండేవి. బలవంతపు వసూళ్లు, బెదిరింపులతో మాఫియా డాన్‌లు చెలరేగిపోయేవారు. అయితే, కొద్దికాలానికి ఆ పరిస్థి మారిపోయింది. అయితే ప్రస్తుత కాలంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బీటౌన్‌ను కలవరానికి గురి చేస్తోంది. ఈ క్రిమినల్ ముఠా నుంచి స్టార్ నటులకు వరుస హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. సబర్మతి జైలు (Sabarmati Central Jail) లోపల నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ నటులను టార్గెట్ చేస్తున్నారు. తొలుత సల్మాన్ ఖాన్ (Salman Khan)ను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్యాంగ్.. తర్వాత రోహిత్ శెట్టి, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, కపిల్ శర్మ.. ఇలా స్టార్ నటులనే లక్ష్యంగా వరుసగా దాడులకు పాల్పడుతోంది. రణ్‌వీర్ సింగ్‌కు కూడా ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు, 2022లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య, 2024 అక్టోబర్‌లో ముంబైలో రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య వెనుక ఈ ముఠా హస్తం ఉందని తేలింది. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిఖీని ముంబైలోనే దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు బిష్ణోయ్ గ్యాంగే బాధ్యత వహించింది.
సల్మాన్ టు టైగర్ ష్రాఫ్
ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఆ తర్వాత సల్మాన్‌కు చాలా సార్లు చంపేస్తామంటూ బెదిరింపులు పంపారు. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ కేవలం సల్మాన్ ఖాన్ అనే అంతా భావించారు. కానీ, ఈ గ్యాంగ్ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత రోహిత్ శెట్టి ఇంటిపై కూడా కాల్పులు జరిపింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించడమే కాకుండా.. అతన్ని చంపేస్తామంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా టైగర్ ష్రాఫ్ (Tiger Shroff )పై కాల్పులు జరిపి మరోసారి ఈ గ్యాంగ్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
ఇది కూడా చదవండి.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..
జైల్లో ఉంటూనే చక్రం తిప్పుతున్నాడు..
భారతదేశంలోని అత్యంత కుట్రపూరిత గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని అత్యంత భద్రత కలిగిన సబర్మతి సెంట్రల్ జైలులో పోలీసు కస్టడీలో ఉన్నారు. అతడిని ఆ జైలు నుంచి బయటకు తరలించకుండా కేంద్ర హోం శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. హోం శాఖ నిబంధనల ప్రకారం.. అతడిని వేరే ప్రాంతానికి తరలించడానికి, ఇతర రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు భౌతికంగా తమ కస్టడీలోకి తీసుకునేందుకు కూడా అవకాశం లేదు. విచారణలు, కోర్టు హాజర్లు అన్నీ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయినప్పటికీ జైల్లో కూర్చొనే ఆయన బాలీవుడ్‌కు ముచ్చెమటలు పట్టించడం ఆందోళనకరంగా మారింది. అంతేకాదు, జైల్లో ఉంటూనే బయట తమ ముఠాతో అతడు సంప్రదింపులు జరుపుతుండటం గమనార్హం.
700కిపైగా షూటర్లు
అతడి నేర సామ్రాజ్యం దేశంలోనే కాకుండా విదేశాలకూ విస్తరించింది. ఈ గ్యాంగ్ కాల్పులు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 మందికి పైగా షూటర్లు ఈ ముఠాలో ఉన్నట్లు భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక బిష్ణోయ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉందని కెనడా, అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..
లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్. 1993 ఫిబ్రవరి 12న పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాకు చెందిన ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు బాల్కరన్ బ్రార్. పంజాబ్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన బిష్ణోయ్.. చండీగఢ్‌లోని డీఏవీ (DAV) కాలేజీ, పంజాబ్ విశ్వవిద్యాలయంలో లా (న్యాయశాస్త్రం) చదివాడు. యూనివర్సిటీలో చదివే సమయంలో అతడు విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. విద్యార్థి వర్గాలతో జరిగిన ఘర్షణల వల్ల ఈయన నేరాల బాట పట్టాడు. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా మారాడు. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లు వంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో అతడి పేరు వినిపించింది.
Also Read..
అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్‌స్కీకి ఇష్టం లేదు
చక్కెర కంపెనీల షేర్లకు భారీ నష్టం.. కేంద్రం నిర్ణయంతో ఇన్వెస్టర్లలో ఆందోళన..
సంబంధిత వార్తలు

Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..
అక్టోబర్ 19, 2026

Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్‌వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?
అక్టోబర్ 18, 2026

Tiger Shroff | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..
- ●Donald Trump Russia Ukraine War | రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్‌స్కీకి ఇష్టం లేదు
- ●Denmark Cyber Attack | ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే.. 88 లక్షల రికార్డులు లీక్..
- ●Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
- ●Fire Accident | పాతబస్తీలో అగ్నిప్రమాదం.. బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
- ●Gold Investment | ఈఎంఐ విధానంలో బంగారం కొనవచ్చా.. ఖర్చు ఎంతవుతుంది..?

Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

Donald Trump Russia Ukraine War | రష్యాపై ఆ సంతకం అందుకే ఆపేశా.. యుద్ధం ఆపడం జెలెన్‌స్కీకి ఇష్టం లేదు

Denmark Cyber Attack | ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే.. 88 లక్షల రికార్డులు లీక్..

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు



