త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ai Plus | చ‌వ‌క ధ‌ర‌ల‌కే 5జి ఫోన్ల‌ను లాంచ్ చేసిన ఏఐ ప్ల‌స్ కంపెనీ.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Ai Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ ఏఐ ప్ల‌స్ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు నోవా2 5జి, నోవా2 అల్ట్రా 5జి, నోవా ఫ్లిప్ 5జి ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇవి చ‌వ‌క ధ‌ర‌ల‌కే ల‌భిస్తుండ‌డం విశేషం. అలాగే ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను సైతం ఈ ఫోన్ల‌లో అందిస్తున్నారు.

S

Technology | Published On Apr 10, 2026, 10.51 am IST

Ai Plus | చ‌వ‌క ధ‌ర‌ల‌కే 5జి ఫోన్ల‌ను లాంచ్ చేసిన ఏఐ ప్ల‌స్ కంపెనీ.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?
Advertisement

Ai Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ ఏఐ ప్ల‌స్ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్లు నోవా2 5జి, నోవా2 అల్ట్రా 5జి, నోవా ఫ్లిప్ 5జి ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇవి చ‌వ‌క ధ‌ర‌ల‌కే ల‌భిస్తుండ‌డం విశేషం. అలాగే ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను సైతం ఈ ఫోన్ల‌లో అందిస్తున్నారు.

ఏఐ ప్ల‌స్ నోవా2 5జి..

ఏఐ ప్ల‌స్ నోవా2 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.74 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. 600 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చినందున ఫోన్ డిస్‌ప్లే సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇందులో యూనిసోక్ టి8200 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 6జీబీ వ‌ర‌కు గ‌రిష్ట ర్యామ్‌, 128జీబీ వ‌ర‌కు గ‌రిష్ట స్టోరేజ్‌ను ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వ‌రకు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ల‌తోపాటు మైక్రో ఎస్‌డీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను కూడా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో సెకండ‌రీ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఏఐ ప్ల‌స్ నోవా2 5జి ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కు ప‌క్క భాగంలో ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఎఫ్ఎం రేడియో వ‌స్తుంది. ఐపీ64 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెంట్‌ను ఇచ్చారు. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఏఐ ప్ల‌స్ నోవా2 5జి ఫోన్‌ను ప‌ర్పుల్‌, గ్రీన్‌, పింక్‌, బ్లూ, బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ, 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.8,999 ఉండ‌గా, 6జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.10,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏప్రిల్ 14 నుంచి విక్ర‌యించ‌నున్నారు.

ఏఐ ప్ల‌స్ నోవా2 అల్ట్రా 5జి..

ఏఐ ప్ల‌స్ నోవా2 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ల‌భిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్ ఉంది. 8జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వ‌రకు పెంచుకోవ‌చ్చు. ఇందులో హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండ‌గా, ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఐపీ68 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ ఉంది. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాట‌రీ ఉంది. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు.

ఈ ఫోన్‌ను బ్లూ, గ్రీన్‌, ప‌ర్పుల్‌, బ్లాక్‌, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేయ‌గా, దీనికి చెందిన 6జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.16,999గా ఉంది. 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.18,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏప్రిల్ 17 నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.2వేల బోన‌స్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్ ధ‌ర త‌గ్గుతుంది.

ఏఐ ప్ల‌స్ నోవా ఫ్లిప్ 5జి..

ఏఐ ప్ల‌స్ నోవా ఫ్లిప్ 5జి ఫోన్‌లో 6.9 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్ ఫ్లిప్ టైప్‌లో ఉంటుంది. క్లామ్ షెల్ ఫోల్డింగ్ ఫామ్ ఫ్యాక్ట‌ర్ ఆధారంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. కేవ‌లం 7.2 ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి ఉండి ఈ ఫోన్‌ను అత్యుంత స్లిమ్‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వ‌చ్చింది. ప్రైమ‌రీ ఇంట‌ర్న‌ల్ స్క్రీన్ 6.9 ఇంచులు ఉంటుంది. ఇది అమోలెడ్ డిస్‌ప్లే కాగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫోన్‌కు వెనుక వైపు మ‌రో 3 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే 1.5కె రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ల‌భిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లోనే విడుద‌లైంది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌ను ఇచ్చారు.

వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు ఉంటుంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను సైతం ఇచ్చారు. 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను ఇచ్చారు. 4325 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఏఐ ప్ల‌స్ నోవా ఫ్లిప్ 5జి ఫోన్‌ను గ్లేసియ‌ర్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ సింగిల్ వేరియెంట్ ధ‌ర రూ.49,999గా ఉంది. ఈ ఫోన్‌ను మే నెల‌లో అందుబాటులోకి తేనున్నారు.

Advertisement
Advertisement