Adobe Photoshop | ఫొటోషాప్‌లో ఏఐ ఎడిటింగ్ మరింత సులువు.. కొత్త ఫీచర్లు ఇవే..
Adobe Photoshop | టెక్ దిగ్గజ సంస్థ అడోబ్ తన ఫొటోషాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్లు, ఏఐ ఆధారిత ఎడిటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్, అడోబ్ స్టాక్ ఇంటిగ్రేషన్ వంటి విభాగాల్లో కొత్త నియంత్రణలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Sep 1, 2026, 4.56 pm IST
Adobe Photoshop | టెక్ దిగ్గజ సంస్థ అడోబ్ తన ఫొటోషాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్లు, ఏఐ ఆధారిత ఎడిటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్, అడోబ్ స్టాక్ ఇంటిగ్రేషన్ వంటి విభాగాల్లో కొత్త నియంత్రణలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అప్‌డేట్‌లో అధునాతన ఎడిటింగ్ కంట్రోల్స్‌తోపాటు ఏఐ ఆధారిత టూల్స్, డైనమిక్ టెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్స్, ప్రాంప్ట్‌ల ఆధారంగా ఎడిటింగ్ చేసేందుకు ప్రత్యేక వర్క్‌స్పేస్‌ను కూడా అందిస్తోంది. ఫొటోషాప్‌లో లైట్ అడ్జస్ట్‌మెంట్ లేయర్ అనే కొత్త నాన్-డిస్ట్రక్టివ్ అడ్జస్ట్‌మెంట్ లేయర్‌ను అడోబ్ తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్‌పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ వంటి నియంత్రణలు ఉంటాయి. ఇవి కెమెరా రా స్థాయి ఫలితాలను అందిస్తూనే ఫొటోషాప్ లేయర్స్ వర్క్‌ఫ్లోలోనే మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తాయి.
టెక్ట్స్ ప్రాంప్ట్‌లతో ఎడిటింగ్..
ఫైర్‌ఫ్లై ఇమేజ్ 5 ఆధారంగా పనిచేసే ఇన్‌స్ట్రక్ట్ ఎడిట్ విత్ మాస్క్స్ ఫీచర్ ద్వారా చిత్రంలోని పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకుని యూజర్ సూచించిన మార్పులను ఏఐ చేస్తుంది. ఇందుకోసం ప్రతిసారీ ఎడిట్ చేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మార్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు మూసుకుపోయిన కళ్లను తెరవమని లేదా ఒక వ్యక్తి తలపై టోపీ పెట్టమని ఫొటోషాప్‌కు సూచించవచ్చు. మాస్క్ వెలుపల ఉన్న ప్రాంతాలు మాత్రం మారకుండా ఉంటాయి. ఇందులో ముఖాలు, లోగోలు, బ్రాండ్ అసెట్స్ కూడా యథాతథంగా ఉంటాయి. మార్కప్ అనే మరో ఫీచర్‌తో చిత్రంపైనే నేరుగా గీయడం ద్వారా చేయాల్సిన ఎడిట్‌ను సూచించవచ్చు. ఏదైనా ప్రాంతానికి రంగు మార్చాల్సి ఉంటే దాన్ని మార్క్ చేయడం, ఒక నిర్దిష్ట స్థానాన్ని సూచించేందుకు బాణాలు గీయడం లేదా కొత్త అంశాన్ని జోడించాల్సిన చోట సుమారుగా ఆకారాన్ని బ్రష్‌తో గీయడం వంటివి చేయవచ్చు. ఇలా టెక్స్ట్ ప్రాంప్ట్‌తోపాటు విజువల్ సూచనలను కూడా అందించడం ద్వారా మరింత కచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.
90 కోట్లకు పైగా స్టాక్ అసెట్స్..
డైనమిక్ టెక్స్ట్, షేప్స్ అండ్ పాత్స్ ఫీచర్‌తో ఫొటోషాప్‌లోని డైనమిక్ టెక్స్ట్ సామర్థ్యాలను కస్టమ్ షేప్స్, పాత్స్‌కు కూడా విస్తరించారు. టెక్స్ట్‌ను వంపులు, ఫ్రీ-ఫార్మ్ లేఅవుట్లకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు. దీంతో ప్రతిసారీ మాన్యువల్‌గా టెక్స్ట్‌ను రీఫార్మాట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్టాక్ ప్యానెల్ ఇంటిగ్రేషన్ ద్వారా 90 కోట్లకు పైగా అడోబ్ స్టాక్ అసెట్స్ ను ఫొటోషాప్‌లోనే యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ప్రత్యేకంగా డాక్ చేసుకునే ప్యానెల్ ద్వారా యూజర్లు అడోబ్ స్టాక్ అసెట్లను సెర్చ్ చేయడం, ప్రివ్యూ చూడటం, వాటిని ఉపయోగించడం వంటివి ఫొటోషాప్ నుంచి బయటకు వెళ్లకుండానే చేయవచ్చు. ఫొటోషాప్‌లో ఏఐ అసిస్టెడ్ ఎడిటర్ పేరుతో కొత్త ఆప్షనల్ వర్క్‌స్పేస్‌ను కూడా అడోబ్ పరిచయం చేసింది. ఇది ప్రస్తుతం బీటా దశలో ఉంది. ప్రొ ఎడిటర్ వర్క్‌ఫ్లోకు వెలుపల ప్రాంప్ట్‌ల ఆధారంగా ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు ఈ వర్క్‌స్పేస్ ఉపయోగపడుతుంది. ఇందులో సహజ భాషలో సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకమైన ప్రాంప్ట్ బార్, ఏఐ ఆధారిత జనరేటివ్ టూల్స్ ఉంటాయి.

సహజ భాషలో ప్రాంప్ట్‌లు..
ఏఐ అసిస్టెడ్ ఎడిటర్‌లో ప్రాంప్ట్ టు ఎడిట్ ద్వారా క్లిష్టమైన మాన్యువల్ ఎడిటింగ్ అవసరం లేకుండా సహజ భాషలో ఇచ్చే సూచనలతో చిత్రాలను మార్చుకోవచ్చు. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ టూల్ చిత్రాల నుంచి బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించడంతోపాటు ఎడ్జ్‌లను మెరుగుపరచడానికి, చిత్రాన్ని అవసరానికి అనుగుణంగా కస్టమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. జనరేటివ్ ఎక్స్‌పాండ్ ద్వారా చిత్ర పరిమాణాన్ని పెంచి, ఇప్పటికే ఉన్న కాంపోజిషన్‌కు సహజంగా సరిపోయే కొత్త కంటెంట్‌ను ఏఐతో రూపొందించవచ్చు. రిమూవ్ టూల్ ద్వారా అవసరం లేని వస్తువులు, ఇతర డిస్ట్రాక్షన్‌లను తొలగించవచ్చు. జనరేటివ్ ఫిల్ ద్వారా టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా చిత్రంలో కొత్త కంటెంట్‌ను జోడించడం, ఉన్న కంటెంట్‌ను మార్చడం లేదా తొలగించడం చేయవచ్చు.
రిజల్యూషన్ తక్కువ ఉంటే..
జనరేటివ్ అప్‌స్కేల్ ఫీచర్ తక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాల నాణ్యతను పెంచుతూ షార్ప్‌నెస్, విజువల్ ఫిడెలిటీని సాధ్యమైనంత వరకు కాపాడుతుంది. ఏఐ మార్కప్ ద్వారా చిత్రాలపై విజువల్‌గా సూచనలు ఇవ్వడంతో పాటు చేయాల్సిన మార్పులను స్పష్టంగా తెలియజేసి మరింత కచ్చితమైన ఫలితాలను పొందవచ్చు. ప్రొ ఎడిటర్‌ను ఉపయోగించాలనుకునే వారికి కూడా ప్రాంప్ట్ టు ఎడిట్ ఫీచర్ కాంటెక్స్చువల్ టాస్క్ బార్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సెలెక్షన్ చేయకుండానే సహజ భాషలో ఇచ్చే సూచనలతో మొత్తం చిత్రాన్ని మార్చుకోవచ్చు. ప్రాంప్ట్ టు ఎడిట్ ద్వారా వచ్చిన ప్రతి ఫలితం లేయర్ స్టాక్‌లో జనరేటివ్ లేయర్‌గా మారుతుంది. దీంతో చేసిన మార్పులను క్రమబద్ధంగా, నాన్-డిస్ట్రక్టివ్‌గా నిర్వహించుకోవచ్చు. కొత్త ఫొటోషాప్ ఫీచర్లు ప్రస్తుతం పరిశీలించేందుకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏఐ అసిస్టెడ్ ఎడిటర్ మాత్రం ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు
- ●Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
- ●Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
- ●Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు - నెటిజన్ల ట్రోలింగ్

Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..




