Adobe Photoshop | ఫ్రీగా అడోబ్ ఫొటోషాప్.. ఆఫర్ పొందేందుకు ఈ నెల 8వ తేదీనే లాస్ట్ ఛాన్స్!
Adobe Photoshop | ఫొటోలు ఎడిట్ చేయడానికి ఇప్పుడంటే ఆన్‌లైన్‌లో రకరకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ మొదట్నుంచి ఫొటోల ఎడిట్ అంటే గుర్తొచ్చేది అడోబ్ ఫొటోషాప్‌నే. డబ్బా కంప్యూటర్ల కాలం నుంచి నేటి మొబైల్ యుగం దాకా ఇప్పటికీ దీనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్‌డేట్ చేసుకుంటూ పోవడమే.
Technology | Published On Dec 6, 2025, 6.54 am IST
Adobe Photoshop | ఫొటోలు ఎడిట్ చేయడానికి ఇప్పుడంటే ఆన్‌లైన్‌లో రకరకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ మొదట్నుంచి ఫొటోల ఎడిట్ అంటే గుర్తొచ్చేది అడోబ్ ఫొటోషాప్‌నే. డబ్బా కంప్యూటర్ల కాలం నుంచి నేటి మొబైల్ యుగం దాకా ఇప్పటికీ దీనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్‌డేట్ చేసుకుంటూ పోవడమే. తాజాగా ఈ అడోబ్ ఫొటోషాప్ మరింత అప్‌డేట్ అయ్యింది. ఇప్పటివరకు అప్లికేషన్ రూపంలోనే ఉన్న ఈ సాఫ్ట్‌వేర్.. ఇటీవల ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ రూపంలో కస్టమర్లకు లభిస్తోంది. దీంతో ఎలాంటి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే.. జస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
Adobe Photoshop ఎక్స్‌టెన్షన్ ద్వారా ముఖ్యమైన ఎడిటింగ్ ఫీచర్లు అన్నింటినీ ఉపయోగించుకోవచ్చని అడోబ్ తెలిపింది. అంతేకాదు ఈ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి 12 నెలల పాటు ఉచిత యాక్సెస్‌ను అందిస్తున్నట్లు అడోబ్ ప్రకటించింది. డిసెంబర్ 8వ తేదీలోపు ఈ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ద్వారా ఈ ఎక్స్‌టెన్షన్‌ను మరింత ఇంప్రూవ్ చేస్తామని తెలిపింది. కొత్త ఫీచర్లను కూడా జోడిస్తామని పేర్కొంది. ఆన్‌లైన్‌లో లైట్ వెయిట్ ఎడిటింగ్ టూల్స్ కోసం చూసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది.
ఎలా క్లైయిమ్ చేసుకోవాలి?
ముందుగా గూగుల్ క్రోమ్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం Adobe Photoshop Chrome extension అని సెర్చ్ చేయాలి. అలా వచ్చిన ఎక్స్‌టెన్షన్‌ను మన బ్రౌజర్‌కు యాడ్ చేసుకోవాలి. ఆ ఎక్స్‌టెన్షన్ బ్రౌజర్‌కు యాడ్ అయిన తర్వాత ఒక పాప్ అప్ వస్తుంది. అక్కడ కనిపించే Start your free year of Photoshop Web క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ Adobe ID లేదా జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వాలి. అప్పుడు మీ అకౌంట్‌కు 12 నెలల కాలపరిమితితో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించి అడోబ్‌లోని ముఖ్యమైన ఎడిటింగ్ ఫీచర్లు అన్నింటినీ వాడుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, కలర్ అండ్ ఎక్స్‌పోజర్ అడ్జస్ట్‌మెంట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా మీకు కావాల్సిన డైమెన్షన్లలో ఇమేజ్‌లను క్రాప్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Adobe Photoshop | ఫొటోషాప్‌లో ఏఐ ఎడిటింగ్ మరింత సులువు.. కొత్త ఫీచర్లు ఇవే..
సెప్టెంబర్ 1, 2026

Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హై అలర్ట్.. భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక..
జులై 18, 2026

Google Chrome | గూగుల్ క్రోమ్‌లో భారీ అప్‌డేట్.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కూడా ఆటోఫిల్..
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?
- ●OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
- ●Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
- ●Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం
- ●Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అప్రజాస్వామికం
- ●Suman Ray | ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమన్ రే..

India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ

Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్

Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం



