ZIM vs SA | విజయంతోనే సెమీస్‌లోకి.. జింబాబ్వేపై ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు..!
ZIM vs SA | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ ఎయిట్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి గ్రూప్-లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింజాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది.
ZIM vs SA | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ ఎయిట్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి గ్రూప్-లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింజాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. సికిందర్ రజా హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసి మూడో విజయాన్ని నమోదు చేసింది.
జింబాబ్వే పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన బ్రయాన్ బెన్నెట్ కూడా తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యాడు. జింబాబ్వే 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా తప్ప మరో బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. రజా 43 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఎనిమిది ఫోర్ల సహాయంతో 73 పరుగులు చేయడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. తర్వాత క్లైవ్ మాడాండే 20 బంతుల్లో 26 పరుగులు చేశాడు. బెన్నెట్ 15, డియాన్ మేయర్స్ 11, మరుమాని 7, రయాన్ 5, టోని మడాండే 2 పరుగులు మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా జార్జ్ లిండే, ఎన్గిడి, నోర్ట్జేకి ఒక్కో వికెట్ దక్కింది.
జింజాబ్వే నిర్దేశించి 154 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ క్వింటన్ డికాక్ డకౌట్ కాగా.. ఐడెన్ మార్క్రామ్ 4 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ (31), డేవాల్డ్ బ్రేవిస్ (42), డేవిడ్ మిల్లర్ (22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత ట్రిస్టన్ స్ట్రబ్స్ (21*), జార్జ్ లిండే (30*) జట్టును విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా 3 వికెట్లు పడగొట్టగా.. ముజర్బాని, బ్రాడ్ ఎవాన్స్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






