Ishan Kishan | అదితి హుండియాతో ఇషాన్ కిషన్ పెళ్లి వార్తలు.. అలాంటిదేం లేదన్న తల్లి..!
Ishan Kishan | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Ishan Kishan | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ మెరుపులు మెరిపించిన ఇషాన్, ఉస్మాన్ ఖాన్‌ను స్టంప్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. ఆ తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. మోడల్ అదితి హుండియాతో రిలేయన్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు ప్రచారం జరిగింది. ఇషాన్ తాత అనురాగ్ పాండే సైతం మీడియాతో మాట్లాడుతూ ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా తమకు ఇష్టమేనని తెలిపారు.
అదితి అతనికి స్నేహితురాలని, పిల్లల ఇష్టాన్ని అంగీకరించాలన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇషాన్-అదితి పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇషాన్ తల్లి సుచిత్రా దేవి చెక్ పెట్టారు. ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. క్రికెట్‌పై దృష్టి పెట్టాల్సిన సమయమని.. పెళ్లి గురించి మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందన్నారు. పెద్దవాళ్లు కొంచెం భావోద్వేగానికి లోనవుతారని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఇషాన్ తాత అలా మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కుటుంబం దృష్టి పూర్తిగా క్రికెట్ కెరీర్‌పైనే ఉందని వెల్లడించారు.
పాక్‌తో విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జట్టు సభ్యులు, అభిమానులకు అంకితం చేసిన ఇషాన్.. తాను ఈ మ్యాచ్‌ను సాధారణ మ్యాచ్‌లాగా తేసుకున్నానని తెలిపాడు. బంతిని బట్టి షాట్లు ఆడానని, ఒత్తిడికి లోనవలేదని చెప్పాడు. టోర్నీలో తర్వాతి మ్యాచ్‌పైనే దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇషాన్‌కు ఇది వరుసగా రెండో అర్ధశతకం. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
Patna, Bihar: On India beating Pakistan by 61 runs in the ICC Men’s T20 World Cup 2026 match, Indian cricketer Ishan Kishan's mother, Suchitra Devi says, "Many congratulations to the Indian cricket team on their victory. Heartfelt congratulations to the entire team for such a… pic.twitter.com/luxVYzbd7H
— IANS (@ians_india) February 15, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






