త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Semifinal Qualification Scenario | వెస్టిండీస్‌, జింబాబ్వేపై గెలిస్తే భారత్‌ సెమీస్‌కు వెళ్తుందా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?

Semifinal Qualification Scenario | టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై భారీ తేడాతో ఘన విజయం సాధించింది సెమీస్‌ రేస్‌లో పోటీలో నిలిచింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించారు. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ 5.35 రన్‌ రేట్‌తో సూపర్‌ 8 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఓటమితో జింబాబ్వే నెట్ రన్ రేట్ -5.35కి పడిపోయింది.

P

Sports | Published On Feb 24, 2026, 2.30 pm IST

Semifinal Qualification Scenario | వెస్టిండీస్‌, జింబాబ్వేపై గెలిస్తే భారత్‌ సెమీస్‌కు వెళ్తుందా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?
Advertisement

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై భారీ తేడాతో ఘన విజయం సాధించింది సెమీస్‌ రేస్‌లో పోటీలో నిలిచింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించారు. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ 5.35 రన్‌ రేట్‌తో సూపర్‌ 8 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఓటమితో జింబాబ్వే నెట్ రన్ రేట్ -5.35కి పడిపోయింది. గ్రూప్‌-1లో ఉన్న వెస్టిండీస్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా రన్‌ రేట్‌పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండు పాయింట్లతో ఉండగా.. నెట్‌ రన్‌ రేట్‌ 3.80 ఉన్నది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం కీలక మ్యాచ్‌ జరుగనున్నది. ఇందులో ఓడిన జట్టు నేరుగా సెమీస్‌లోకి అర్హత సాధిస్తుంది. మరో జట్లుకు అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.

Semifinal Qualification Scenario | ఇక భారత్‌ సమీస్‌ అవకాశాలు సవాల్‌గానే ఉన్నది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమితో.. రన్‌రేట్‌ 3.80కి పడిపోయింది. భారత్‌ తర్వాత ఇదే గ్రూప్‌లో జింబాబ్వే అత్యంత దారుణంగా ఉంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్‌ తలపడతుంది. సెమీస్‌ చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. రెండు విజయాలు సాధించినా సెమీస్‌ అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా ఇప్పటికే ఒక్కో విజయం సాధించాయి. మరొక్క విజయం సాధించినా నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. భారత్‌ రాబోయే మ్యాచుల్లో తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించించాల్సి ఉంటుంది. ఒకసారి రాబోయే మ్యాచుల్లో సమీకరణాలు ఎలా ఉండనున్నాయో ఓసారి తెలుసుకుందాం..!

సమీకరణాలు ఇలా..

దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడించి.. భారత్‌ రెండు మ్యాచులు గెలిస్తే..

భారత్‌ తర్వాతి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్‌, జింబాబ్వేతో రెండు మ్యాచులు గెలవాలి. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, వెస్టిండీస్‌తో మార్చి 1న కోల్‌కతాలో భారత్‌ తలపడుతుంది. భారత్‌ ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే నాలుగు పాయింట్లు ఖాతాలో ఉంటాయి. దక్షిణాఫ్రికా మిగతా రెండు మ్యాచుల్లో గెలిస్తే ఆరు పాయింట్లు ఉంటాయి. సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంలో భారత్‌ సెమీస్‌కు చేరుకునేందుకు నాలుగు పాయింట్లు సరిపోతాయి. ఎందుకంటే మిగతా రెండు జట్లకు రెండేసి పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ సమీకరణ ప్రకారం భారత్‌కు సెమీస్‌ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

దక్షిణాఫ్రికాను వెస్టిండీస్‌ ఓడిస్తే..

దక్షిణాఫ్రికాను వెస్టిండీస్‌ ఓడిస్తే భారత్‌కు మాత్రం సంక్లిష్టంగా మారుతుంది. అయితే, దక్షిణాఫ్రికాను ఓడిస్తే వెస్టిండీస్‌కు సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ రెండు మ్యాచుల్లో గెలవాలి. అయితే, దక్షిణాఫ్రికాను జింబాబ్వే ఓడించాలి. దాంతో దక్షిణాఫ్రికా రెండు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు వెస్టిండీస్‌, భారత్‌ సెమీ ఫైనల్‌కు వెళ్తాయి. వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. జింబాబ్వేను దక్షిణాఫ్రికా ఓడించి.. భారత్‌ తన రెండు మ్యాచుల్లో గెలిస్తే భారత్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ ఒక్కొక్కటి నాలుగు పాయింట్లతో రేసులో ఉంటాయి. అప్పుడు రన్‌ రేట్‌ని పరిగణలోకి తీసుకుంటారు. భారత్‌ ప్రస్తుత రన్‌ రేట్‌ (-3.800) దారణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై 6-70 పరుగులకుపైగా తేడాతో విజయం సాధిస్తే రన్‌ రేట్‌ మెరుగవుతుంది.

కేవలం ఒక మ్యాచ్‌లోనే భారత్‌ గెలిస్తే ఇలా..

భారత్ రెండు మ్యాచుల్లో ఒక దాంట్లోనే విజయం సాధిస్తే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. దక్షిణాఫిక్రా మిగతా రెండు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుతల్లో వెస్టిండీస్‌పై భారత్‌ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అది కూడా 80 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు భారత్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే జట్టు చెరో రెండు పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మళ్లీ నెట్‌ రట్‌రేట్‌ నిర్ణయాత్మకంగా మారుతుంది. జింబాబ్వేపై భారత్‌ గెలిచి.. వెస్టిండీస్‌పై ఓడిపోతే టీమిండియా సెమీస్‌ రేసు నుంచి వైదొలుగుతుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ సెమీస్‌లోకి వెళ్తాయి.

గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన..

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో జింబాబ్వే అద్భుతంగా రాణించింది. అయితే, సూపర్‌ 8లో వెస్టిండీస్‌ ఏకపక్షంగా సమీకరణాలను మార్చేసింది. కరేబియన్‌ జట్టు అద్భుతమైన విజయంతో సెమీస్‌ రేసులో ముందువరుసలో నిలిచింది. వెస్టిండీస్‌ భారీ నెట్‌ రన్‌ రేట్‌.. భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. నెట్‌ రన్‌ రేట్‌ పరంగా కరేబియన్‌ జట్టు, దక్షిణాఫ్రికాలను పోల్చడం చాలా కష్టం. ఇక భారత్‌ తరహాలోనే జింబాబ్వే పరిస్థితి ఎదుర్కొంటోంది. గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించి అందరినీ ఆశ్చర్య పరిచింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టు మూడు ఓవర్లలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్‌స్పిన్నర్ అకిల్ హుస్సేన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. ఫిబ్రవరి 26న భారత్‌-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌పై అందరి అదృష్టి నెలకొన్నది.

భారత్‌ పరిస్థితి ఇలా..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే, సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాలో లోపాలు బయటపడ్డాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా 18.5 ఓవర్లలోనే 111 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సైతం చేయలేకపోయారు. కేవలం శివమ్‌ దూబే మాత్రమే 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement
Advertisement