Vinesh Phogat | ఆ ఆరుగురు బాధితుల్లోనే నేను కూడా ఉన్న.. వేధింపుల వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసిన వినేశ్..!
Vinesh Phogat | భారత రెజ్లింగ్ సమాఖ్య మరోసారి వార్తల్లోకెక్కింది. వేధింపులకు సంబంధించి ఒలింపియన్ వినేష్ ఫోగాట్ సంచలన విషయాలను బయటపెట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని తెలిపింది.
Vinesh Phogat | భారత రెజ్లింగ్ సమాఖ్య మరోసారి వార్తల్లోకెక్కింది. వేధింపులకు సంబంధించి ఒలింపియన్ వినేష్ ఫోగాట్ సంచలన విషయాలను బయటపెట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని తెలిపింది. ఈ కేసులో తాను బాధితురాలినని వినేశ్ బహిరంగంగా ప్రకటించడం ఇదే తొలిసారు. ఇప్పటి వరకు మౌనం పాటించడానికి కారణం కోర్టులో కేసులో పెండింగ్‌లో ఉండడమేనని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల గుర్తింపును బయటపెట్టకూడదని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నిజం చెప్పాల్సి వచ్చిందని, ఆరు బాధితుల్లో తాను సైతం ఉన్నానని స్పష్టం చేసింది. ఈ తరహా పరిస్థితుల్లో మహిళా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం ఎంత కష్టమైందో వివరించింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అథ్లెట్ మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలదని వ్యాఖ్యానించింది.
అభ్యంతరాలు..
దాదాపుగా 18 నెలలుగా రెజ్లింగ్‌కు దూరంగా ఉన్న వినేశ్ మళ్లీ రింగ్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకుంటోంది. మునుపటిలా మళ్లీ దేశానికి పతకాలు సాధించి.. జాతీయ జెండాకు గౌరవం తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నీపై వినేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోటీలు బ్రిజ్ భూషణ్‌కు చెందిన ప్రైవేట్ కాలేజీలో నిర్వహిస్తున్నారని, అక్కడ నిష్పక్షిక పోటీలు జరుగడం కష్టమని పేర్కొంది. “ఎవరికి ఎలాంటి పాయింట్లు ఇవ్వాలి. ఎవరెవరికి మ్యాచ్‌లు అప్పగించాలనే విషయాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. పదవి లేకపోయినా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని వినేశ్ ఆరోపించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, క్రీడామంత్రిత్వ శాఖ స్పందించడం లేదని విమర్శించింది.
భద్రతపై ఆందోళన
ఎంపీకి చెందిన ప్రాంతంలో పోటీల్లో పాల్గొనడంతో భద్రతాపరంగా తనకు సురక్షితం కాదని వినేశ్ తెలిపింది. అక్కడికి వెళ్లినా వందశాతం ప్రదర్శన చాలా కష్టమని పేర్కొంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రాంగణంలో పారదర్శకత ఉండేలా మీడియా, క్రీడావర్గాలు హాజరవ్వాలని కోరారు. 2023లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో వినేశ్ కీలకపాత్ర పోషించింది. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. అవి నిజమైతే తాను ఉరివేసుకుంటానని అప్పట్లో వ్యాఖ్యానించారు. నిరసనలకు రాజకీయ మద్దతు ఉందని ఆరోపించారు. తాజాగా వినేశ్ వ్యాఖ్యలతో మరోసారి దేశవ్యాప్తంగా ఈ అంశం మళ్లీ చర్చనీయాశంగా మారింది. క్రీడాకారుల భద్రత, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, ఫెడరేషన్ విశ్వసనీయత తదితర అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2026 ఆసియా క్రీడల సన్నాహాల్లో ఈ పరిణామం కీలకంగా మారింది.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






