Vaibhav Suryavanshi | అండర్-19 ప్రపంచకప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్..! రికార్డులు తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ..!
Vaibhav Suryavanshi | అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. భారత దకెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, నాలుగో ఓవర్‌లోనే ఆరోన్ జార్జ్ (9) రూపంలో భారత్‌కు ఎదురుదెబ్బంది. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. 14 ఏళ్ల వైభవ్ 55 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసి, నాలుగు సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టి అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి అవుటయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో అతను 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి.
ఫర్హాన్ బౌలింగ్‌లో వైభవ్ సిక్సర్ల వర్షం..
15వ ఓవర్‌లో స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ వేసిన తొలి రెండు బంతుల్లోనే వైభవ్ రెండు సిక్సర్లు కొట్టాడు. దాంతో మ్యాచ్‌లో సంఖ్య సంఖ్య ఐదుకు పెరిగింది. టోర్నమెంట్‌లో యువ బ్యాట్స్‌మెన్‌కు 20వ సిక్స్ కావడం విశేషం. ఈ రెండు సిక్సర్లతో వైభవ్ అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను 2022 అండర్-19 ప్రపంచ కప్‌లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన 18 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు బౌండరీలు బాదాడు. వాటిలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి.
55 బంతుల్లోనే సెంచరీ..
19వ ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయి మాత్రమే అవుట్ అయ్యాడు. అయినా, వైభవ్ ఏకాగ్రతను కోల్పోకుండా 55 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. అంతకు ముందు 32 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 50 నుంచి 100 పరుగుల మార్కును చేరుకోవడానికి 23 బంతుల్లోనే చేరుకున్నాడు. 100 పరుగులు పూర్తి చేయడానికి వైభవ్ ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఆయుష్ మత్రే 51 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. మత్రే, వైభవ్ జోడీ రెండో వికెట్‌కు 90 బంతుల్లో 142 పరుగుల భాగస్వామ్యం జోడించింది.
వేగంగా సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో..
వైభవ్ అండర్-19 వరల్డ్ కప్‌లో వేగంగా సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో రెండోస్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్‌చుక్ పేరిట ఉన్నది. ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. మలాజ్ ఈ ప్రపంచకప్‌లోనే విండ్‌హోక్ వేదికగా జపాన్‌తో జరిగిన మ్యాచులో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అలాగే, వైభవ్ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
తన రికార్డు తానే..
అంతేకాకుండా ఈ అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వైభవ్ పేరిట ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షినోజాదాను అధిగమించాడు. షినోజాదా 436 పరుగులు చేశాడు. సూర్యవంశీ కేవలం ఏడు మ్యాచుల్లోనే 62.71 యావరేజ్‌తో మొత్తం 439 పరుగులు చేశాడు. అలాగే, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో 100+ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు 50+ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ రికార్డు నెలకొల్పాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఘనత సాధించి.. 18 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో పెనాంగ్‌లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ హిల్ ఒకే ఇన్నింగ్‌లో 12 సిక్సర్లు బాదాడు. డిసెంబర్‌లో ఐసీసీఏ దుబాయిలో యూఏఈ అండర్-19 జట్టుపై కొట్టిన 14 సిక్సర్ల రికార్డును వైభవ్ తిరగరాశాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






