T20 World Cup | భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ..! అదే జరిగితే పాక్ ఖేల్ ఖతం..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ నిరాకరించాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది దేశాలు తలపడాల్సి ఉంది. కానీ, పాకిస్తాన్ సర్కారు మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ నిరాకరించాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది దేశాలు తలపడాల్సి ఉంది. కానీ, పాకిస్తాన్ సర్కారు మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఇంకా పీసీబీ నుంచి అధికారిక సమాచారం ఐసీసీకి అందాల్సి ఉంది. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకానున్నది.
ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం..
భారత్‌తో మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఆ జట్టుపై ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు తగ్గించే ఛాన్స్ ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఆ జట్టు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆదాయంపై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సభ్యదేశాలు తమ అగ్రశ్రేణి జట్లను ఆ దేశానికి వెళ్లేందుకు పంపేందుకు నిరాకరించే ప్రమాదం ఉంది. తమ ఆటగాళ్లను ఆటగాళ్లను పాకిస్తాన్ సూపర్ లీగ్ పాల్గొనకుండా ఐసీసీ నిషేధించే అవకాశం సైతం ఉన్నది. ఏం జరిగినా మ్యాచ్‌ను బహిష్కరిస్తే అది భారత్‌కు ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారత్ ఖాతాలో రెండు పాయింట్లు..
ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. అదే సమయంలో పీసీబీకి జరిమానా విధించే హక్కు ఐసీసీకి ఉన్నది. టోర్నీలో మ్యాచ్ వాకోవర్ కోసం టాస్ సమయంలో భారత జట్టు మైదానంలోకి వెళ్తాల్సి ఉంటుంది. భారత జట్టు మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్తుంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ కోసం హాజరు కాకపోతే మ్యాచ్ రిఫరీ భారత్‌కు రెండు పాయింట్లు ప్రకటిస్తారు. పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్-ఏలో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్లు ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 7న నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. 10న యూఎస్ఏతో, 15న భారత్‌తో, చివరి గ్రూప్ మ్యాచ్ నమీబియాతో ఆడాల్సి ఉంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. దాంతో సల్మాన్ ఆఘా నేతృత్వంలోని జట్టు సూపర్ 8 స్టేజ్‌కు వెళ్లేందుకు అన్ని మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
నాకౌట్, ఫైనల్ సంగతి ఏంటో..?
గ్రూప్-ఏ నుంచి రెండు జట్లు సూపర్ 8 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌తో ఆడకపోతే పాక్ రెండు పాయింట్లను కోల్పోతుంది. గ్రూప్ దశలో మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అందులో అన్ని మ్యాచుల్లో గెలిస్తేనే ఆరు పాయింట్లు లభిస్తాయి. దాంతో ఆ తర్వాత దశలోకి అడుగుపెడుతుంది. ఈ గ్రూప్‌లో పాక్‌కు భారత్ గట్టి పోటీ ఇచ్చే ఇవ్వనుంది. ఇతర జట్లు పసికూనలు కావడంతో పాక్‌కు అవకాశాలున్నాయి. అయితే, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడం విశేషం. దాంతో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఎదురైంది. మళ్లీ గ్రూప్ దశలో నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా జట్లలో ఏదైనా పాకిస్తాన్‌ను ఓడించినా ఆ జట్టుకి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ గ్రూప్ స్టేజీలో మాత్రమే భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తెలిపింది. నాకౌట్ దశలో, ఫైనల్‌కి వచ్చేసరికి వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాక్ అదే వైఖరి కొనసాగిస్తే భారత్‌కే కలిసిరానున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






