త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MS Dhoni | మళ్లీ బ్యాట్‌తో మైదానంలోకి మాజీ కెప్టెన్‌.. ఐపీఎల్‌ కోసం ధోనీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ షురూ..!

MS Dhoni | భారత క్రికెట్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు. రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

P

Sports | Published On Jan 24, 2026, 9.15 pm IST

MS Dhoni | మళ్లీ బ్యాట్‌తో మైదానంలోకి మాజీ కెప్టెన్‌.. ఐపీఎల్‌ కోసం ధోనీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ షురూ..!
Advertisement

MS Dhoni | భారత క్రికెట్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు. రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో 44 ఏళ్ల ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించాడు. అయితే, నెట్స్‌లోకి వెళ్లే ముందు ధోనీ, జేఎస్‌సీఏ కార్యదర్శి సౌరభ్ తివారీతో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోకు క్రికెట్‌ అసోసియేషన్‌ ‘చూడండి.. ఎవరు తిరిగి వచ్చారో! జేఎస్‌సీఏకి గర్వకారణమైన మహేంద్ర సింగ్ ధోనీ’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే, వాటిలో కేవలం నాలుగు విజయాలకే పరిమితమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా ధోనీ కూడా బ్యాటర్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 24.50 సగటుతో మొత్తం 196 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమైన సమయంలో, కొన్ని మ్యాచ్‌లకు ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

వయస్సు పెరిగినా, ఇప్పటికీ చెన్నై జట్టులో ధోనీ పాత్ర అత్యంత కీలకంగానే కొనసాగుతోంది. నాయకత్వ అనుభవం, మార్గనిర్దేశం జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తోంది. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 38.80 సగటుతో 5,439 పరుగులు చేశాడు. ఈ ప్రయాణంలో 24 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జరుగనున్న ఐపీఎల్‌ ధోనీకి చివరిదయ్యే అవకాశాలున్నాయి. అయితే, గతంలో తనకు ఓపిక ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటానని ధోనీ స్పష్టం చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement