త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్‌ను క‌లిసిన హైకోర్టు న్యాయ‌వాదుల సంఘం ప్ర‌తినిధులు

KTR | నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు నియామకాలు, స్థానిక న్యాయవాదుల అవకాశాలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

P

Sports | Published On Jun 21, 2026, 6.54 pm IST

KTR | కేటీఆర్‌ను క‌లిసిన హైకోర్టు న్యాయ‌వాదుల సంఘం ప్ర‌తినిధులు
Advertisement

KTR | నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు నియామకాలు, స్థానిక న్యాయవాదుల అవకాశాలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన అర్హులైన న్యాయవాదుల పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల తమ సంఘం తీసుకున్న తీర్మానాన్ని ప్రతినిధులు కేటీఆర్‌కు వివరించారు. సామాజిక న్యాయ సూత్రాలను పాటిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైకోర్టు నియామకాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలు పొందుతున్నారని, దీని వల్ల స్థానిక అర్హులైన న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జూన్ 15, 2026న జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఆ తీర్మానం అమలులో భాగంగా జూన్ 17న హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం కూడా నిర్వహించినట్లు వివరించారు. త‌మ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రధాన ప్రతిపక్షం తరఫున వాటి అమలుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. తెలంగాణ న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు న్యాయ‌మైన‌వేన‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా తమవంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు కేటీఆర్‌.

Advertisement
Advertisement