త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padma Devendar Reddy | మెద‌క్ ఎమ్మెల్యే రెండు స్పీడ్ బ్రేక‌ర్లు వేసి 200 రీల్స్ పెట్టుకుంటున్న‌డు

Padma Devendar Reddy | మెదక్‌లో పరిస్థితి ఎలా ఉందో అక్కడికి వెళ్లి చూసిన త‌ర్వాత‌ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడాలని, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హిత‌వు ప‌లికారు. మెదక్ ఎమ్మెల్యే రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీల్స్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Jun 21, 2026, 6.58 pm IST

Padma Devendar Reddy | మెద‌క్ ఎమ్మెల్యే రెండు స్పీడ్ బ్రేక‌ర్లు వేసి 200 రీల్స్ పెట్టుకుంటున్న‌డు
Advertisement
  • మైనంప‌ల్లి గారు.. మెద‌క్ ప‌రిస్థితి ఎలా ఉందో చూసి మాట్లాడండి
  • మీరా తెలంగాణ ఉద్య‌మం గురించి మాట్లాడేది?
  • వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకోం
  • మీడియా స‌మావేశంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చ‌రిక‌

Padma Devendar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మెదక్‌లో పరిస్థితి ఎలా ఉందో అక్కడికి వెళ్లి చూసిన త‌ర్వాత‌ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడాలని, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హిత‌వు ప‌లికారు. మెదక్ ఎమ్మెల్యే రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీల్స్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ మైనంప‌ల్లిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.
మెద‌క్, మ‌ల్యాజిగిరి అభివృద్ధిని గాలికొదిలేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

మెదక్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం ఖాయం. మెదక్, మల్కాజిగిరిని గాలికి వదిలేశారు. ఇంకోసారి మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. మైనంపల్లికి దాడులు, ప్రతి దాడులు మాత్రమే తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో చెప్పాలి. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి కేసులు, సిట్‌ల‌కే స‌రిపోయిండు..

కేసీఆర్ పరిపాలన బాగుందని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మైనంపల్లి 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసులు, సిట్‌లకు మాత్రమే పరిమితం అయ్యారు. మెదక్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 11 చెరువులు తెగిపోయినా మెదక్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. మెదక్‌లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడం ఖాయం అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement