త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women’s Nations Cup | చ‌రిత్ర సృష్టించిన హాకీ జ‌ట్టు.. 2-0 తేడాతో ఎఫ్ఐహెచ్ టైటిల్ కైవ‌సం

Women's Nations Cup | ప్ర‌తిష్టాత్మ‌క ఎఫ్ఐహెచ్ వుమెన్స్ నేష‌న‌ల్ క‌ప్ 2025-26 టీమిండియా జాతీయ మ‌హిళ ఫీల్డ్ హాకీ టీమ్ చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ వుమెన్స్ ఫీల్డ్ టీమ్‌ను 2-0 తేడాతో ఓడించి టైటిల్‌ను నెగ్గింది.

P

Sports | Published On Jun 21, 2026, 7.44 pm IST

Women’s Nations Cup | చ‌రిత్ర సృష్టించిన హాకీ జ‌ట్టు.. 2-0 తేడాతో ఎఫ్ఐహెచ్ టైటిల్ కైవ‌సం
Advertisement

Women's Nations Cup | ప్ర‌తిష్టాత్మ‌క ఎఫ్ఐహెచ్ వుమెన్స్ నేష‌న‌ల్ క‌ప్ 2025-26 టీమిండియా జాతీయ మ‌హిళ ఫీల్డ్ హాకీ టీమ్ చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ వుమెన్స్ ఫీల్డ్ టీమ్‌ను 2-0 తేడాతో ఓడించి టైటిల్‌ను నెగ్గింది. తొలి నుంచే దూకుడుగా ఆడిన భార‌త్ తొలి క్వార్డ‌ర్‌లోనే ఆధిప‌త్యాన్ని చాటింది. నాలుగో నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను నవనీత్ కౌర్ సమర్థవంతంగా గోల్‌గా మలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. ఆ వెంటనే భార‌త్ మ‌రింత దూకుడును పెంచింది. 15వ నిమిషంలో దీపిక బ‌లంగా కొట్టిన షాట్‌ను సునిలితా తొప్పో అద్భుతంగా డిఫ్లెక్ట్ చేసి గోల్‌గా మార్చ‌డంతో స్కోర్ 2-0కి చేరింది. తొలి క్వార్ట‌ర్ ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఆధిక్యంలో నిలిచింది. మిగ‌తా స‌మయంలోనూ భార‌త్ ర‌క్ష‌ణాత్మ‌క ధోరిణి ప్ర‌ద‌ర్శించి న్యూజిలాండ్‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు.

రెండో క్వార్టర్‌లో ఆతిథ్య జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ టీమిండియా డిపెన్ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లో భారత్ మరింత ఆధిపత్యం చూపింది. దూకుడైన ఆటతో న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. నవనీత్ కౌర్ వేసిన రివర్స్ షాట్‌ను కివీస్ గోల్‌కీపర్ అద్భుతంగా అడ్డుకుంది. నాలుగో క్వార్టర్ ఆరంభంలో న్యూజిలాండ్‌కు వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్‌కీపర్ సవిత చక్కటి రిఫ్లెక్స్‌తో అడ్డుకుని జట్టుకు ఊర‌ట‌నిచ్చింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలుపుకున్న భారత్ 2–0తో విజయం సాధించి కప్పును గెలిచింది. పూల్ ద‌శ‌లో అమెరికాపై 3–2, జపాన్‌పై 2–1, ఉరుగ్వే 3–2 జట్లపై విజయం సాధించిన భారత్, సెమీఫైనల్లో చిలీపై 6–0తో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లాల్‌రెంసియామి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకుంది. టోర్నమెంట్‌లో ఆరు గోల్స్ చేసిన దీపికా అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచింది. ఈ విజయం ద్వారా భారత్ వచ్చే సీజన్ ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రో లీగ్‌లో చోటు ద‌క్కించుకుంది. ఈ సంద‌ర్భంగా హాకీ ఇండియా.. జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌కు భారీ నగదు బహుమతిని ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement