Under 19 World Cup | జగజ్జేత యువ భారత్.. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఇంగ్లండ్‌పై విక్టరీ.. రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్..!
Under 19 World Cup | ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో యువత భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వంద పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్‌ని గెలిచింది. భారత జట్టు విధించిన 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.
Under 19 World Cup | ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో యువత భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వంద పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్‌ని గెలిచింది. భారత జట్టు విధించిన 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కాలేబ్ ఫాల్కనర్ సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి అతనికి సహకారం దొరక్కపోవడంతో ఓటమి తప్పలేదు. ఫాల్క్‌నర్ 67 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అంతకు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా అండర్-19 వరల్డ్ కప్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ని నెగ్గింది. ఇంతకు ముందు భారత్ 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాల్లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
టాస్ గెలిచి..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. అండర్19 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో ఇంగ్లండ్ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్‌ను సాధించగలిగింది.
సూర్యవంశి విధ్వంసం..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు 20 పరుగులు వద్ద షాక్ తగలింది. తొమ్మిది పరుగులు చేసి ఆరోన్ జార్జ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశారు. రెండో వికెట్‌కు ఇద్దరు 90 బంతుల్లో 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాత్రే 51 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. వైభవ్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా.. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 71 బంతుల్లో 150 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్ల సహాయంతో 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. వైభవ్, వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు 39 బంతుల్లో 89 పరుగులు జోడించాడు. భారత్ స్కోర్ 251 పరుగులకు చేరిన సమయం వైభవ్ అవుట్ అయ్యాడు.
160 పరుగుల్లో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్
ఆ తర్వాత భారత్ 160 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. వేదాంత్ 36 బంతుల్లో 32 పరుగులు, విహాన్ మల్హోత్రా 36 బంతుల్లో 30 పరుగులు, అభిజ్ఞాన్ కుందు 31 బంతుల్లో 40 పరుగులు చేశారు. ఆర్‌ఎస్ అంబ్రిస్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. ఖిలాన్ పటేల్ మూడు పరుగులకు, హెనిల్ పటేల్ ఐదు పరుగులకు అవుటయ్యారు. ఇంగ్లండ్ తరఫున తరఫున జేమ్స్ మింటో మూడు వికెట్లు తీశాడు. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీయగా, మ్యానీ లమ్స్‌డెన్‌కి ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






