త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World cup | ఢిల్లీ మ్యాచ్‌లో టీమిండియా రికార్డులు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా ప‌దో విజ‌యం.. 47వ సారి 200 స్కోర్‌..!

T20 World cup | ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 93 ప‌రుగుల తేడాతో భార‌త్ గెలిచింది. దాంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా ప‌దో విజ‌యాన్ని న‌మోదు చేసి టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. భార‌త్ త‌ప్ప మ‌రే జ‌ట్టు వ‌రుస‌గా ప‌ది మ్యాచుల‌ను గెలువ‌లేక‌పోయాయి.

P

Sports | Published On Feb 13, 2026, 4.18 pm IST

T20 World cup | ఢిల్లీ మ్యాచ్‌లో టీమిండియా రికార్డులు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా ప‌దో విజ‌యం.. 47వ సారి 200 స్కోర్‌..!
Advertisement

T20 World cup | ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 93 ప‌రుగుల తేడాతో భార‌త్ గెలిచింది. దాంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా ప‌దో విజ‌యాన్ని న‌మోదు చేసి టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. భార‌త్ త‌ప్ప మ‌రే జ‌ట్టు వ‌రుస‌గా ప‌ది మ్యాచుల‌ను గెలువ‌లేక‌పోయాయి. గురువారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో భార‌త్ రికార్డు స్థాయిలో 47వ సారి 200పైగా ప‌రుగులు చేయ‌డం విశేషం. ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా 29 సార్లు 200 మార్క్‌ను తాకి రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 28సార్లు, ఆస్ట్రేలియా, వెస్టిండిస్ 25 సార్లు 200 స్కోర్ చేశాయి.

వ‌రుస‌గా ప‌దో విజ‌యం..

2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత టీమిండియా వ‌రుస‌గా ప‌ది మ్యాచుల్లో గెలిచింది. 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ అజేయంగా నిలిచింది. తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది మ్యాచుల్లో విజ‌యం న‌మోదు చేసింది. ఒక మ్యాచ్ టాస్ ప‌డ‌కుండానే ర‌ద్ద‌య్యింది. అంటే టీమిండియా వ‌రుస‌గా ఎనిమిది మ్యాచుల‌ను (రోహిత్ కెప్టెన్సీ), ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో (సూర్యకుమార్‌ కెప్టెన్సీ)లో రెండు మ్యాచుల‌ను గెలిచింది. టీమిండియా ఆ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వ‌రుస‌గా అత్య‌ధిక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యాల‌ను న‌మోదు చేశాయి. దక్షిణాఫ్రికా 2024లో వరుసగా ఎనిమిది, ఆస్ట్రేలియా 2022, 2024లోనే అదే స్థాయిలో మ్యాచులు నెగ్గింది. 2010-2014లో ఇంగ్లండ్ వ‌రుస‌గా ఏడు మ్యాచులు గెలిచింది. 2012, 2014లోనూ భార‌త్ వ‌రుస‌గా ఏడు మ్యాచుల్లో గెలిచింది.

భార‌త్‌కు పెద్ద విజ‌యం

న‌మీబియాపై విజ‌యం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ర‌న్స్ ప‌రంగా భార‌త్‌కు భారీ విజ‌యం. ఇంత‌కు ముందు 2012లో కొలంబోలో ఇంగ్లండ్‌పై టీమిండియా 90 ప‌రుగుల తేడాతో నెగ్గింది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీం ఇండియా 73 పరుగుల తేడాతో, 2022లో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2024లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో భార‌త జ‌ట్టు ఓడించింది.

47వ సారి 200 ప‌రుగులు..

భార‌త్ మొత్తం మీద 47వ సారి 200 ప్ల‌స్ ప‌రుగులు చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌లో భారత్ 14 సార్లు 200 మార్క్‌ను తాకింది. ఈ స‌మ‌యంలో మ‌రే జ‌ట్టు ఏడు సార్లు కంటే ఎక్కువ ఈ ఘనతను సాధించ‌లేక‌పోయాయి. 200/9 స్కోర్ టీ20 ప్రపంచ కప్‌లో భార‌త్ సాధించిన మూడో అత్య‌ధిక స్కోర్‌. 2007లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లు కోల్పోయి భార‌త్ 218 పరుగులు చేసింది. 2021లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గురువారం నాటి మ్యాచ్‌లో 210 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన న‌మీబియా 18.2 ఓవ‌ర్ల‌లో 116 ర‌న్స్‌కి అవుట్ అయ్యింది. లారెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలిచాడు. టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కేవ‌లం ఏడు ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్ల తీశాడు. హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బుమ్రా, శివ‌మ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్‌ల‌కు త‌లా ఒక వికెట్ ద‌క్కింది.

ప‌ది వికెట్లు తీసిన స్పిన‌ర్లు..

భారత్-నమీబియా మ్యాచ్‌లో స్పిన్న‌ర్ల హ‌వా కొన‌సాగింది. మొత్తం ప‌ది వికెట్లు స్పిన్న‌ర్లే తీయ‌డం గ‌మ‌నార్హం. భార‌త్‌తో జరిగిన ఏ పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనైనా స్పిన్న‌ర్లు ఎక్కువ‌గా వికెట్లు తీయ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2016లో నాగ్‌పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచులో స్పిన్న‌ర్లు త‌మ ఆధిప‌త్యం కొన‌సాగిస్తూ 12 వికెట్లు ప‌డ‌గొట్టారు. తాజాగా టీ20 ప్రపంచ కప్‌లో 18 మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పటివరకు వేసిన మొత్తం ఓవర్లలో స్పిన్ బౌలర్లు 50.4 శాతం బౌలింగ్ చేయ‌గా.. ఇది ఏ టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లోనై ఇదే అత్య‌ధికం. గతంలో శ్రీలంకలో జరిగిన 2012 టోర్నమెంట్‌లో స్పిన్నర్లు 45.8 శాతం బౌలింగ్ వేశారు.

Advertisement
Advertisement