Team India | జయహో భారత్..! రెండేళ్లలో నాలుగు ఐసీసీ టైటిల్స్..!
Team India | గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ జట్టు నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్‌లో భారత్ స్థాయిని మరింత పెంచింది. గత రెండు సంవత్సరాల్లో భారత్ నాలుగు ప్రపంచ టైటిళ్లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Team India | గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ జట్టు నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్‌లో భారత్ స్థాయిని మరింత పెంచింది. గత రెండు సంవత్సరాల్లో భారత్ నాలుగు ప్రపంచ టైటిళ్లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. వివిధ విభాగాల్లో ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉండగా, యువ ప్లేయర్లు సైతం భారత్‌కు క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించారు. 2024 నుంచి భారత్ ఆధిపత్యం చెలాయించిన టోర్నమెంట్లు ఏంటో చూద్దాం..!
మెన్స్ టీ20 ప్రపంచకప్ విజయం

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి.. మరోసారి ఐసీసీ ట్రోఫీ కల సాకారం చేసింది. ఈ విజయంతో కోట్లాది మంది భారతీయ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది భారత్‌కు రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ..

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 2025 ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో భారత్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు.
తొలిసారిగా వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్..

2025 సంవత్సరం భారత్‌కు మరపురాని సంవత్సరంగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ ఘనత సాధించింది. ఇది మహిళల క్రికెట్‌లో భారత్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గతినే మార్చివేసింది. దాంతో భారత్ ఖాతాలో తొలి వరల్డ్ కప్ టైటిల్ చేరింది.
బ్లైండ్ వుమెన్స్ విభాగంలో టీ20 ప్రపంచకప్

భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు సైతం గతేడాది టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కొలంబోలోని పీ సారా ఓవల్‌లో జరిగిన ఫైనల్లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్ తొలిసారిగా నిర్వహించారు. భారత్ విజేతగా నిలిచింది. భారత్ నేపాల్‌ను 5 వికెట్ల నష్టానికి 114 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.
ఆరోసారి అండర్-19 వరల్డ్ కప్ టైటిల్..

భారత అండర్-19 జట్టు ఆరోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లాండ్‌కు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో కేలబ్ ఫాల్కనర్ 67 బంతుల్లో 115 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






