T20 World Cup Trophy | టీ20 ప్రపంచకప్ ట్రోఫీకి, జైపూర్‌కు ఏంటి సంబంధం..?
T20 World Cup Trophy | టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించడం మొదలుకొని, భారత్‌తో మ్యాచ్ ఆడబోము అని పాక్ చేసిన డ్రామా, సూపర్ 8కు కూడా రాకుండానే ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవడం వంటి అనేక సంచలన విషయాలకు ఈసారి టోర్నీ వేదికైంది.
T20 World Cup Trophy | టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించడం మొదలుకొని, భారత్‌తో మ్యాచ్ ఆడబోము అని పాక్ చేసిన డ్రామా, సూపర్ 8కు కూడా రాకుండానే ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవడం వంటి అనేక సంచలన విషయాలకు ఈసారి టోర్నీ వేదికైంది. అయితే ఈ ప్రపంచకప్ ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ప్రపంచకప్‌కు ఇచ్చే ఐకానిక్ ట్రోఫీని జైపూర్‌లో రూపొందించారు. టోర్నమెంట్‌కు జైపూర్ నగరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. జైపూర్‌కు చెందిన ట్రోఫీ డిజైనర్ అమిత్ పబువాల్ తెలిపిన వివరాల ప్రకారం, టీ20 ప్రపంచకప్ ట్రోఫీని తానే తయారు చేశానని చెప్పారు. అయితే ట్రోఫీకి సంబంధించిన ప్రాథమిక డిజైన్ కాన్సెప్ట్‌ను ఆస్ట్రేలియాకు చెందిన మినాలే బ్రైస్ రూపొందించారని తెలిపారు.
2007 నుంచే తయారీ..
పబువాల్ తెలిపిన ప్రకారం, ట్రోఫీ డిజైన్ అవుట్‌లైన్ 2007లో సిద్ధమైంది. అదే ఏడాది ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ ను నిర్వహించారు. ఆ తరువాత ఈ ట్రోఫీని తయారు చేసే బాధ్యతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తనకు అప్పగించిందని ఆయన చెప్పారు. డిజైన్ అవుట్‌లైన్ ఖరారైన తర్వాత ట్రోఫీ తయారీ పనిని ఐసీసీ నాకు అప్పగించింది. అలా 2007లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ తయారైంది.. అని ఆయన పీటీఐకి తెలిపారు. తాను అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ట్రోఫీగా పేరుగాంచిన ఫ్రెండ్‌షిప్ కప్ ట్రోఫీని కూడా రూపొందించానని తెలిపారు. ఆ ట్రోఫీ రూపకల్పన విస్తృతంగా గుర్తింపు పొందడంతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ రూపకల్పన బాధ్యతను తనకు అప్పగించిందని తెలిపారు.
వెండితో తయారీ.. మీద ప్లాటినం పూత..
మొదటగా ఐసీసీ ఈ ట్రోఫీని టైటానియం, గాజు మిశ్రమంతో తయారు చేయాలని యోచించింది. టీ20 క్రికెట్ వేగవంతమైన, ఆధునిక శైలిని ప్రతిబింబించేలా డిజైన్ ఉండాలని వారు భావించారు.. అని ఆయన చెప్పారు. ఈ ఆలోచనపై అనేక నమూనాలు తయారు చేశారు. అయితే మెటల్ నిర్మాణంతో గాజు భాగాలను కలిపేటప్పుడు అవి పదేపదే విరిగిపోవడంతో ఆ డిజైన్‌ను అమలు చేయడం సాంకేతికంగా కష్టమైంది. అనేక ప్రయోగాల తర్వాత ఆ కలయిక సాంకేతికంగా సాధ్యం కాదని నేను సూచించాను.. అని ఆయన వివరించారు. చివరకు ట్రోఫీని వెండితో తయారు చేసి దానిపై ప్లాటినం పూత వేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. దీంతో ట్రోఫీ బలంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ టోర్నమెంట్‌కు అనువుగా మారిందని పేర్కొన్నారు.
అసలు ట్రోఫీని ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంచుతారని, విజేత జట్టుకు అదే నమూనాలో తయారు చేసిన ప్రతిరూపాన్ని అందజేస్తారని పబువాల్ తెలిపారు. ఈ ట్రోఫీ సుమారు 21 ఇంచుల ఎత్తు కలిగి ఉండగా దాని బరువు సుమారు 6 కిలోల వరకు ఉంటుంది. ఇది వెండితో తయారవ్వగా, దానిపై ప్లాటినం పూత ఉంటుందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026

Telangana Tourism | హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివల్ నిర్వహణ : మంత్రి జూపల్లి
ఏప్రిల్ 28, 2026

Night Tourism | సూర్యాస్తమయం తర్వాతే అసలైన వినోదం..! రాత్రిపూట సందర్శించేందుకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..!
ఏప్రిల్ 22, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



