త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suryakumar | వాంఖ‌డేలో రికార్డుల మోత మోగించిన సూర్య కుమార్‌..! కోహ్లీని అధిగ‌మించిన కెప్టెన్‌..!

Suryakumar | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ‌నివారం వాంఖ‌డేలో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుతంగా చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో అజేయంగా 84 ప‌రుగులు చేశాడు.

P

Sports | Published On Feb 8, 2026, 3.23 pm IST

Suryakumar | వాంఖ‌డేలో రికార్డుల మోత మోగించిన సూర్య కుమార్‌..! కోహ్లీని అధిగ‌మించిన కెప్టెన్‌..!
Advertisement

Suryakumar | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ‌నివారం వాంఖ‌డేలో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుతంగా చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో అజేయంగా 84 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య‌కి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. టాస్ ఓడిపోయి టీమిండియా బ్యాటింగ్ వ‌చ్చింది. సూర్య 84 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. 162 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది.

రికార్డుల మోత‌..

అమెరికాతో మ్యాచ్‌లో సూర్యకుమార్ ప‌లు రికార్డుల మోత మోగించాడు. టీ20లో భారతదేశం తరఫున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీని వెన‌క్కి నెట్టి ఈ ఘ‌న‌త సాధించాడు. సూర్యకుమార్ 105 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 125 మ్యాచుల్లో 16 సార్లు అవార్డును తీసుకున్నాడు. రోహిత్ శ‌ర్మ 14 అవార్డుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ అక్ష‌ర్ ప‌టేల్ ఎనిమిది సార్లు అవార్డును అందుకున్నాడు.

యువ‌రాజ్‌, రోహిత్ శ‌ర్మ‌..

టీ20 ప్రపంచ కప్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వారిలో యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. తాజాగా ఆ రికార్డును సూర్యకుమార్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ టోర్నీలో సూర్యకుమార్ 19 మ్యాచ్‌లలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. యువరాజ్, అశ్విన్, రోహిత్ ఒక్కొక్కరు మూడుసార్లు అందుకును అందుకున్నారు. ఈ విష‌యంలో కోహ్లీ అంద‌రికీ కంటే ముందు ప్లేస్‌లో ఉన్నాడు. 35 మ్యాచుల్లో ఎనిమిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అర్ష్‌దీప్ సింగ్ సైతం..

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం ఓ రికార్డును క్రియేట్ చేశాడు. 15 మ్యాచ్‌ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అర్ష్‌దీప్ సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ 29 వికెట్లు పడగొట్టి శ్రీలంకకు చెందిన వనిందు హసరంగాతో స‌మానంగా నిలిచాడు. హసరంగా సైతం 29 వికెట్లు తీశాడు. ఈ విషయంలో దక్షిణాఫ్రికాకు చెందిన అన్రిచ్ నోర్ట్జే అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. నోర్ట్జే 30 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Advertisement
Advertisement