T20 World Cup | బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్.. ఆడతారా? లేదా? 24గంటల్లో నిర్ణయం చెప్పాలని ఆదేశం..!
T20 World Cup | త్వరలోనే టీ20 ప్రపంచకప్ మొదలుకానున్నది. ఈ మెగా టోర్నీకి ముందు వివాదం చెలరేగింది. భారత్‌లో తాము ఆడబోమంటున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ తుది అల్టిమేటం జారీ చేసింది. ఐసీసీ బోర్డు సమావేశం బుధవారం జరిగింది.
T20 World Cup | త్వరలోనే టీ20 ప్రపంచకప్ మొదలుకానున్నది. ఈ మెగా టోర్నీకి ముందు వివాదం చెలరేగింది. భారత్‌లో తాము ఆడబోమంటున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ తుది అల్టిమేటం జారీ చేసింది. ఐసీసీ బోర్డు సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మెజారిటీ నిర్ణయం ఆధారంగా భారత్‌లో బంగ్లాదేశ్ ఆడాలా? వైదొలగాలని ఆదేశించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ 24గంటల్లో నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. భద్రతా కారణాలను చూపుతూ బీసీసీ తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే, గ్రూప్ మార్చే అవకాశాలన్ని సైతం పరిశీలించాలని కోరగా.. ఐసీసీ డిమాండ్లను తోసిపుచ్చింది. తాజాగా జరిగిన సమావేశంలో 24గంటల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.
ఐసీసీ బోర్డు సమావేశానికి అన్ని సభ్య దేశాల డైరెక్టర్లు హాజరయ్యారు. ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు, బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బార్డ్, జింబాబ్వే క్రికెట్ అధ్యక్షుడు తవెంగా ముకుహ్లానీ, క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిశోర్ షాలో, క్రికెట్ ఐర్లాండ్ ఛైర్మన్ బ్రయాన్ మెక్‌నీస్, క్రికెట్ న్యూజిలాండ్ ప్రతినిధి రోజర్ ట్వాస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రతినిధి మహ్మద్ మూసాజీ, క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ చైర్మన్ మీర్వైస్ అష్రఫ్ హాజరయ్యారు. ఈ భేటీలో ఐసీసీ ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక విభాగం చీఫ్ ఆండ్రూ ఎఫ్‌గ్రేవ్ సైతం పాల్గొన్నారు.
భారత్‌లో ఆడడానికి నిరాకరిస్తున్న నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ ఐసీసీ ఆఖరి అవకాశం ఇచ్చింది. భారత్ వెళ్లబోమంటే మరో జట్టుకు అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెప్పాలని బీసీబీకి సూచించింది. ఓటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సభ్యుల్లో చాలా మంది ప్రత్యామ్నాయ జట్టును ఆడించేందుకు అనుకూలంగా ఉన్నారు. దాంతో భారత్‌లో ఆడటమా? తప్పుకోవడమా? అన్నదానిపై బీసీబీకి ఒక రోజు గడువు ఇచ్చింది.
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టు వేలంలో కొనుగోలు చేసింది. అయితే, అతన్ని విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీసీబీ ప్రపంచకప్‌లో తాము భారత్‌లో ఆడబోమని, మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. ఇందుకు జట్టు భద్రతా కారణాలను చూపింది. మ్యాచులను తరలించకపోతే లేకపోతే గ్రూప్ సీలో ఉన్న తమను గ్రూప్ సీలోకి మార్చాలని కోరగా.. ఐసీసీ ఈ డిమాండ్లను తోసిపుచ్చింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు లీగ్ మ్యాచులన్నీ కోల్‌కతా, ముంబయి నగరాల్లో జరుగాల్సి ఉంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండిస్‌తో ఆడనుంది.
ఈ అంశంపై బీసీబీ అధికారులు చేసిన ప్రకటనలతో వివాదం మరింత ముదిరింది. నజ్రుల్ ఇస్లాం ఈ విషయంలో సొంత జట్టు ఆటగాళ్లనే ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. దాంతో క్రికెటర్లంతా సొంత బోర్డుపైనే తిరుగుబాటు చేశారు. దాంతో బీసీబీ జోక్యం చేసుకుంది. నజ్రుల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వివాదం కొంత సద్దుమణిగినా బీసీబీ మొండిగా డిమాండ్లపైనే ఉంది. అయితే, ఆటగాళ్లు భారత్‌లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇక బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగితే ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్ జట్టును తీసుకోవాలని ఐసీసీ భావిస్తుంది. గతంలో 2009లో ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి జింబాబ్వే వైదొలిగిన సమయంలో స్కాట్లాండ్‌ను ఆడించారు. భారత్‌లో పర్యటించేందుకు నిరాకరిస్తే ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను టీ20 వరల్డ్ కప్‌లో ఆడిస్తారు. ప్రస్తుతం బీసీబీ తుది నిర్ణయం కోసం ఐసీసీ ఎదురుచూస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో ఎవరు ఏ గ్రూప్‌లో..
గ్రూప్ ఏ : భారత్, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్
గ్రూప్ బీ : ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే
గ్రూప్ సీ : బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్
గ్రూప్ డీ : ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






