IND Vs NZ 1st T20I | నాగ్‌పూర్ టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్..!
IND Vs NZ 1st T20I | ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోందని కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు.
IND Vs NZ 1st T20I | ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోందని కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. గతవారం ప్రత్యేకమైందని తెలిపాడు. ప్రపంచ కప్‌కు ముందు సొంతగడ్డపై భారత్‌తో ఆడడం కంటే మంచి సన్నాహం మరొకటి లేదని, క్రిస్టియన్ క్లార్క్ టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు శాంట్నర్ చెప్పాడు. తాము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. రాత్రి మంచు కురిసే అవకాశం ఉందని తెలిపాడు.
ఈ మ్యాచ్ కుల్దీప్, హర్షిత్ రాణాలను టీమిండియా పక్కన పెట్టింది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విజయం సాధించిన న్యూజిలాండ్.. అదే జోరులో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నది. టీ20 కెప్టెన్ మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తిరిగి జట్టులోకి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరింది. స్టేడియంలో జరిగిన 26 మ్యాచుల్లో 14 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు కేవలం 11 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఇది ఇద్దరు కెప్టెన్లకు పరీక్షగా మారనున్నది.
భారత జట్టు : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






