త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Techie Laid Off for Not Using AI | ఏఐ ఉపయోగించి కోడ్ రాయడం లేదని టెకీని ఉద్యోగంలో నుంచి తీసేసిన ఐటీ కంపెనీ

వార్నీ.. నన్ను అందుకు ఉద్యోగంలో నుంచి తీసేశారా అని షాక్ అయిన ఆ ఉద్యోగి.. చూశారా.. నేను ఏఐని ఉపయోగించడం లేదని, నన్ను ఉద్యోగంలో నుంచి పీకేశారు అంటూ ఆ టెకీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.

J

Viral news | Published On Jan 21, 2026, 7.06 pm IST

Techie Laid Off for Not Using AI | ఏఐ ఉపయోగించి కోడ్ రాయడం లేదని టెకీని ఉద్యోగంలో నుంచి తీసేసిన ఐటీ కంపెనీ
Advertisement

Techie Laid Off for Not Using AI | ఇది ఏఐ యుగం. ఒకప్పుడు ఏ రంగంలో అయినా కష్టపడి పని చేసేవాళ్లు. అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్లు. కానీ ఈ జనరేషన్ ఏఐ లాంటి అడ్వాన్స్‌డ్ టూల్స్‌ని ఉపయోగించుకొని స్మార్ట్ వర్క్ చేస్తోంది. గంటల్లో చేయాల్సిన పనిని ఏఐ ఉపయోగించి నిమిషాల్లో చేసేస్తున్నారు. దాదాపుగా అన్ని రంగాల్లో ఏఐని వాడటం అనేది ప్రస్తుత జనరేషన్‌లో కామన్ అయింది. ఏఐని ఉపయోగించకుండా పని చేయని వాళ్లు వెనుకబడి పోతున్నారు. ఎంత స్కిల్ ఉన్నా ఏఐని ఉపయోగించి పని చేయకపోతే ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ.

ఓ కంపెనీ తన ఉద్యోగిని ఉన్నపళంగా జాబ్‌లో నుంచి పీకేసింది. కనీసం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్‌గా జాబ్‌లో నుంచి తీసేయడంతో ఎందుకు తీసేశారు అని కంపెనీని ప్రశ్నించాడు ఆ టెకీ. దీంతో మిగితా ఉద్యోగులు రాసినంత స్పీడ్‌గా ఆ ఉద్యోగి కోడ్ రాయడం లేదని, మిగితా ఉద్యోగులు ఏఐని ఉపయోగించి కోడ్‌ని రాస్తుంటే.. ఆ ఉద్యోగి మాత్రం తన సొంతంగా కోడ్ రాస్తున్నాడట. వీకెండ్స్‌లో ఇంట్లో కూర్చొని కూడా కోడ్ రాస్తున్నా కూడా తన కొలిగ్స్‌ని అందుకోలేకపోతున్నాడట. దీంతో మిగితా ఉద్యోగుల కన్నా స్లోగా అతడు కోడ్ రాస్తున్నాడని గుర్తించిన మేనేజ్‌మెంట్ ఉద్యోగంలో నుంచి పీకేసిందట.