26-26 | భారత్‌లో 26-26 పేరుతో ఉగ్రదాడులకు జైషే కుట్ర..! నిఘా వర్గాల అలెర్ట్..!
26-26 | పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM) భారత్‌లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ) లక్ష్యంగా చేసుకున్నారని, ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
26-26 | పాక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM) భారత్‌లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని ) లక్ష్యంగా చేసుకున్నారని, ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. రిపబ్లిక్ వేడుకలు లక్ష్యంగా పెట్టుకొని దాడులకు ప్లాన్ చేస్తోందని, జనవరి 26ని సూచిస్తూ 26-26 కోడ్ పేరు పెట్టినట్లుగా తెలిపాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీతో పాటు సున్నిత ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మొదటిసారిగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన వాంటెడ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అల్ ఖైదా ఉగ్రవాది, ఢిల్లీ నివాసి అయిన మొహమ్మద్ రెహాన్, బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడుతో సహా దక్షిణ భారతంలో జరిగిన పలు బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారిగా గుర్తించిన షాహిద్ ఫైసల్ ఫొటోలు ఉన్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు సమన్వయంతో దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాయని, జాతీయ వేడుకలకు అంతరాయం కలిగించి, భయాందోళనలను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ దాడులు చేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైష్ ఏ మహ్మద్ ఈ కుట్ర చేస్తోందని.. కశ్మీర్‌లో భారీ జరుగుబోతున్నట్లుగా నిర్ధిష్ట సమాచారం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. అయోధ్య రామాలయం సైతం టార్గెట్ లిస్ట్‌లో ఉంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే-ఎ-మొహమ్మద్, పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ల మధ్య సంబంధాలపై ఏజెన్సీలు ఆరా తీస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ జమ్మూ కశ్మీర్, పంజాబ్, దిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 26-26 ఉగ్రకుట్రకు ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భద్రతా సంస్థలు తెలిపాయి. రిపబ్లిక్ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






