T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌లో నేడు కీలక మ్యాచ్‌లు.. సూపర్-8పై మరింత స్పష్టత..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో మూడు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో నాలుగు జట్లు, గ్రూప్-డీ నుంచి రెండు జట్లు తలపడనున్నాయి. ఉదయం దక్షిణాఫ్రికా-యూఏఈ, మధ్యాహ్నం పాకిస్తాన్-నమీబియా, రాత్రి భారత్-నెదర్లాండ్స్ తలపడనున్నాయి.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో మూడు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో నాలుగు జట్లు, గ్రూప్-డీ నుంచి రెండు జట్లు తలపడనున్నాయి. ఉదయం దక్షిణాఫ్రికా-యూఏఈ, మధ్యాహ్నం పాకిస్తాన్-నమీబియా, రాత్రి భారత్-నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఇప్పటికే సూపర్ ఎయిర్ దశకు చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చినా.. ఈ రోజు మ్యాచులు కీలకం కానున్నాయి. తొలి మ్యాచ్ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియం వేదికగా జరుగనున్నది. గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా మూడు విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సూపర్-8కి అర్హత సాధించాయి.
గ్రూప్ స్టేజ్‌లో ఒక్క ఒటమి లేకుండా విజయంతో లీగ్ దశను ముగించాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఇక యూఏఈ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఓడిపోయి.. కెనడాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం ఎలాంటి ప్రభావం చూపకపోయినా అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, సూపర్8లోకి మంచి ముగింపుతో ఎంట్రీ ఇవ్వాలని బరిలోకి దిగబోతోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో పాక్-నమీబియా తలపడనున్నాయి. గ్రూప్-ఏలో పాకిస్తాన్ మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందింది. అయితే, భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. భారత్ మూడు మ్యాచుల్లో మూడించిని గెలిచి ఇప్పటికే సూపర్ ఎయిట్‌లోకి దూసుకెళ్లింది. ఇక పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే.
లేకపోతే టోర్నీ నుంచి వైదొలిగే అవకాశాలున్నాయి. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ కంటే యూఎస్‌ఏ జట్టు ముందంజలో ఉంది. రెండు జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్లు ఉండగా.. రన్ రేట్ పరంగా అమెరికా జట్టు మెరుగ్గా ఉంది. నమీబియా ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఒక్క విజయాన్నైనా నమోదు చేయాలన్న కసితో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాయాది జట్టుకు ఇబ్బందులు తప్పవు. పాక్ ఓడిపోతే యూఎస్‌ఏ సూపర్ ఎయిట్‌లోకి వెళ్తుంది. ఇక సాయంత్రం 7 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటికే సూపర్–8 దశకు అర్హత సాధించిన భారత్‌కు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారనుంది. నెదర్లాండ్స్ జట్టుకు భారత్‌పై విజయం కష్టతరమైందే. ఇదిలా ఉండగా.. నేటి మ్యాచులతో సూపర్8కి సంబంధించి స్పష్టత రానున్నది. ముఖ్యంగా పాకిస్తాన్ అర్హత సాధిస్తుందా? ఇంటి దారి పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






