T20 World Cup | మాకు ఆర్థిక నష్టం.. భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు శ్రీలంక బోర్డు లేఖ..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పీసీబీపై ఇతర దేశాల బోర్డులు తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ వివాదం భారత్, ఐసీసీకి పరిమితం కాకుండా శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) పాక్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పీసీబీపై ఇతర దేశాల బోర్డులు తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ వివాదం భారత్, ఐసీసీకి పరిమితం కాకుండా శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) పాక్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో మ్యాచ్ విషయంలో నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం క్రికెట్‌కు హాని కలిగించడమే కాకుండా పర్యాటకంతో పాటు వాటాదారుల ఆదాయంపై సైతం ప్రభావం చూపి భారీగా ఆర్థిక నష్టానికి దారి తీస్తుందని లంక బోర్డు స్పష్టం చేసింది. వాస్తవానికి భారత్-పాక్ మ్యాచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లలో ఈ మ్యాచ్‌కే వ్యూయర్ షిప్ రావడంతో పాటు టీవీ ప్రకటనలకు భారీ ధర పలుకుతుంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగకపోతే టోర్నీ మొత్తం ఆదాయంపై ప్రభావం చూపుతుందని లంక బోర్డు హెచ్చరించింది.
శ్రీలంక క్రికెట్ నిర్వహణ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పీసీబీకి లంక బోర్డు అధికారికంగా లేఖ రాసింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుందని.. మ్యాచ్‌కు సమయంలో స్టేడియం పూర్తిగా నిండిపోతుందని అంచనా వేసినట్లు లంక క్రికెట్ పేర్కొంది. మ్యాచ్ జరుగకపోతే హోటల్ బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉందని, విమానయాన సంస్థలు, స్థానిక రవాణా, భద్రతా సంస్థలు, ఈవెంట్ స్టాఫ్ సైతం నష్టపోతారని పేర్కొంది. ఈ నిర్ణజ్ఞం శ్రీలంక పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. ఇది కేవలం ఒక మ్యాచ్‌కు సంబంధించిన విషయం కాదని పీసీబీకి లంక బోర్డు స్పష్టం చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోవడం వల్ల భారీ ఆర్థిక నష్టాలు, పర్యాటక ఆదాయంలో కోత సహా విస్తృత ఆర్థిక నష్టాలుంటాయని నివేదిక పేర్కొంది. మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం, బోర్డు కట్టుబడి ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా లేఖలో పాకిస్తాన్‌కు కీలక విషయాన్ని గుర్తు చేసింది. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకైన సమయంలో శ్రీలంక క్లిష్ట పరిస్థితుల్లోనూ పాక్‌లో పర్యటించిందని గుర్తు చేసింది. విశ్వాసం, సహకార స్ఫూర్తిని పాక్ గుర్తుచుకుంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే సుమారు 250 మిలియన్ డాలర్ల (రూ.2వేలకోట్లకు పైగా) నష్టం జరిగే అవకాశం ఉంది. ఐసీసీ ఇటీవల 2024-27 సీజన్‌కు ప్రతి బోర్డుకు అందే మొత్తాన్ని ప్రకటించింది. పీసీబీ వాటా రూ.3వేలకోట్లకుపైగా ఉంది. ఏవైనా నష్టాలను భర్తీ చేయడానికి ఐసీసీ ఆ మొత్తాన్ని ఉపయోగించే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






