త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SRH vs RR | అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా..! అభిషేక్ శ‌ర్మ చెత్త రికార్డు..!

SRH vs RR | ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా కూడా తెరవకుండానే ఔట్ అయ్యాడు. దీంతో టి20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సార్లు డక్ అయిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు.

P

Sports | Published On Apr 14, 2026, 7.45 am IST

SRH vs RR | అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా..! అభిషేక్ శ‌ర్మ చెత్త రికార్డు..!
Advertisement

SRH vs RR | ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా కూడా తెరవకుండానే ఔట్ అయ్యాడు. దీంతో టి20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సార్లు డక్ అయిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు అభిషేక్ శర్మ 18 టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఏడు సార్లు సున్నాస్కోర్‌కే పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, సంజూ శాంసన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 2018లో 32 టీ20 ఇన్నింగ్స్‌లో ఆరు సార్లు డక్ అయ్యాడు. సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్స్‌లలో ఆరు సార్లు ఖాతా తెర‌వ‌కుండానే ఔట్ అయ్యాడు. గుర్‌కీరత్ సింగ్ మాన్ 2013లో 19 ఇన్నింగ్స్‌లలో ఐదు సార్లు డక్ అయ్యాడు.

సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి బంతికే ఔట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగాయి.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 216/6 భారీ స్కోరు చేసింది. క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే కుదేలైంది. తొలి ఓవర్‌లోనే ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పేశాడు. ఆ తర్వాత కూడా వికెట్లు కోల్పోతూ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
డోనోవన్ ఫెరెరా (69), రవీంద్ర జడేజా (45) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement
Advertisement