త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs SA | భారత్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 111 రన్స్‌కే కుప్పకూలిన టీమిండియా..!

IND Vs SA | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. ప్రొటీస్‌ జట్టు విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. మాత్రమే చేయగలిగింది.

P

Sports | Published On Feb 22, 2026, 10.50 pm IST

IND Vs SA | భారత్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 111 రన్స్‌కే కుప్పకూలిన టీమిండియా..!
Advertisement

IND Vs SA | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. ప్రొటీస్‌ జట్టు విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. మాత్రమే చేయగలిగింది. 2024 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి భారత్‌ను దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్స్‌ ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. మార్కో జాన్సెన్‌, కార్బిన్‌ బాష్‌, కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డారు. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఇదే తొలి ఓటమి కాగా.. దక్షిణాఫ్రికా ఐదు విజయాలను నమోదు చేసింది.

ఈ సారి ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌..

వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్‌ అయిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న అభిషేక్‌ శర్మ (15) మరోసారి నిరాశ పరిచాడు. ఈ వరల్డ్‌ కప్‌లో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన ఇషాన్‌ మార్క్రామ్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. రెండో ఓవర్‌లో భారత్‌ 5 పరుగుల వద్ద తిలక్‌ వర్మ (1) మార్కో మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ (11), కెప్టెన్‌ సూర్యకుమార్‌ (18), రింకు సింగ్‌ (0), హర్ష్‌దీప్‌ సింగ్‌ (1) పెవిలియన్‌కు చేరారు. ఇక చివరలో శుభ్‌దూబే (42) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండాపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు రెండంకెల స్కోర్‌ చేయడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్‌కు నాలుగు వికెట్లు, కేషవ్‌ మహరాజ్‌కు మూడు, కార్బిన్‌ బాష్‌కి రెండు వికెట్లు దక్కగా.. మార్క్రామ్‌కి ఒక వికెట్‌ పడగొట్టాడు.

రాణించిన ప్రొటీస్‌ బౌలర్లు

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. భారీ స్కోర్‌ టార్గెట్‌లో బరిలోకి దిగిన భారత జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఏ దశలోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. అలాగే, రన్స్‌ తీసేందుకు కూడా బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడ్డారు. ఒక దశలో టీమిండియా పది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభం నుంచే ప్రొటీస్‌ బౌలర్లు పట్టు భిగించారు. వరుసగా టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతూ వచ్చిన ఇషాన్‌ కిషన్‌ను కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రామ్‌ తొలి ఓవర్‌లోనే టీమిండియా బ్యాటింగ్‌ పతనానికి బాటలు వేశాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కార్బిన్‌ బాష్‌, లుంగి ఎన్గిడి, టీమిండియా ఓటమిని శాసించారు. ఓ వైపు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయగా.. మరో వైపు ఫీల్డర్లు సైతం సహకారం అందించారు. కళ్లు చెదిరేలా క్యాచులు అందుకుంటూనే.. మరో వైపు పరుగులు తీయకుండా అడ్డుకట్ట వేశారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయాన్ని నమోదు చేసింది.

దక్షిణాఫ్రికా ఇన్సింగ్స్‌..

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారత జట్టుకు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63, డెవాల్డ్ బ్రెవిస్ 45, ట్రిస్టన్ స్టబ్స్ 44* రాణించారు. జస్‌ప్రీత్‌ బుమ్రా రాణించినా.. మిగతా బౌలర్లు ప్రొటీస్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. సఫారీ జట్టు ఆరంభంలోనే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డి కాక్ 6, మార్‌క్రమ్ 4, ర్యాన్ రికెల్టన్ 7 త్వరగా ఔటయ్యారు. అనంతరం బ్రెవిస్–మిల్లర్ జోడీ 97 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మిల్లర్ దూకుడు పెంచి 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. చివర్లో స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచాడు. బుమ్రా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా 45, వరుణ్ చక్రవర్తి 47 పరుగులు ఇవ్వడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్‌ చేయగలిగింది. బ్యాట్‌తో రాణించిన డేవిడ్‌ మిల్లర్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement
Advertisement