త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shoaib Akhtar | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం.. షోయ‌బ్ అక్త‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..

Shoaib Akhtar | టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భార‌త్ మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

P

Sports | Published On Mar 9, 2026, 5.22 pm IST

Shoaib Akhtar | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం.. షోయ‌బ్ అక్త‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..
Advertisement

Shoaib Akhtar | టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భార‌త్ మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిపుణులు భారత జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తుండగా.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆధిపత్యం క్రికెట్‌కు నష్టం క‌లిగించిందంటూ అక్క‌సు వెల్ల‌గ‌క్కాడు.

భారత్ క్రికెట్‌ను పాడుచేసింది..

పాకిస్తాన్‌లో “గేమ్ ఆన్ హై” అనే కార్యక్రమంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ భారత్ ఆధిపత్యాన్ని ఓ ధ‌నిక బాలుడితో పోల్చాడు. 'పక్కదేశంలో ఒక ధనిక పిల్లాడు పేద పిల్లలందరినీ పిలిచి రండీ క్రికెట్ ఆడుదాం అంటాడు. మొద‌ట ఎనిమిది జ‌ట్ల‌లో నాలుగు జట్లను ఉంచుకొని.. మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. భారత్ మనతో చేస్తున్నది కూడా ఇదే. భారత్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేసింది అంటూ త‌న క‌డుపు మంట‌ను బ‌య‌ట‌పెట్టాడు. అయితే, టీమిండియా సాధించిన ఈ విజయం వెనుక ఉన్న పటిష్టమైన విధానాలు ఉన్నాయని ప్రశంసించాడు. తొలుత భారత్ పాలసీ గెలిచింద‌ని, ఆ త‌ర్వాత వారి సిస్టమ్ గెలిచింద‌న్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిభ గెలిచిలింద‌ని కొనియాడాడు. భారత్ సరైన చోట డబ్బును పెట్టుబడిగా పెడుతోందని, స్టేడియాలు, బయోమెకానికల్ ల్యాబ్స్, శిక్షణ కేంద్రాలపై చేస్తున్న ఖర్చు ఈ ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని పేర్కొన్నాడు. అయితే, భార‌త్ విష‌యాన్ని చూసి త‌ట్టుకోలేక నిరాశ‌తో ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని అభిమానులు మండిప‌డుతున్నారు.

ఫైన‌ల్‌కు ముందు మ‌రోలా..

అయితే, ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు అక్త‌ర్ భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేశారు. భార‌త్ బ‌ల‌మైన జ‌ట్ట‌ని అంగీక‌రించాడు. అయితే, క్రికెట్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా న్యూజిలాండ్ గెల‌వాల‌ని కోరుకున్న‌ట్లు చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంద‌ని, కానీ భారత్ కూడా 150 కోట్ల మంది ఆశల ఒత్తిడిని మోస్తోంద‌ని పేర్కొన్నాడు. భారత్ ఫేవరెట్ అయినా, ఈ సారి న్యూజిలాండ్ వరల్డ్‌కప్ గెలిస్తే మంచిదని భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. టీమిండియా విజ‌యానికి కార‌ణం హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్లేయ‌ర్స్‌పై న‌మ్మ‌కం ఉంచి.. క‌ష్ట‌కాలంలో వారికి సపోర్ట్ ఇవ్వ‌డం పెద్ద టోర్నీల్లో కీల‌క‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఆమిర్ వ్యాఖ్య‌లు ఇలా..

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. న్యూజిలాండ్ బౌలింగ్ కూడా భారత్ విజయంలో ప్రధాన కారణమని అన్నారు. కివీస్ బౌలర్లు భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచ‌లేక‌పోయార‌ని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో చేసిన మార్పులు నాకు అర్థం కాలేద‌ని, అభిషేక్ శర్మ స్పిన్‌కు ఇబ్బంది పడుతున్నాడని తెలిసినా స్పిన్నర్లతో ఎందుకు ఎక్కువ ఓవ‌ర్లు బౌలింగ్ వేయించ‌లేద‌ని ప్ర‌శ్నించాడు. 2005 నుంచి న్యూజిలాండ్ జట్టును చూస్తున్నాన‌ని.. ఇంత ఒత్తిడిలో ఆ జ‌ట్టు ఆడ‌డం తొలిసారిగా చూశాన‌ని తెలిపాడు. కీల‌క మ్యాచుల్లో బౌల‌ర్లే కాదు.. బ్యాట‌ర్లు సైతం జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌గ‌ల‌ర‌ని భార‌త్ నిరూపించింద‌ని ఆమిర్ తెలిపాడు. టీమిండియా సెమీఫైన‌ల్‌కు కూడా చేర‌ద‌న్న ఆమిర్ జోష్యం చెప్పిన విష‌యం తెలిసిందే. భారత్ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరి, న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది. సోషల్ మీడియా వేదిక‌గా ఆమిర్‌పై అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

Advertisement
Advertisement