త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Lanka Cricket | శ్రీ‌లంక హెడ్‌కోచ్ ప‌ద‌వికి జ‌య‌సూర్య రాజీనామా.. టీమిండియా మాజీ కోచ్‌కు బాధ్య‌త‌లు..!

Sri Lanka Cricket | అంద‌రూ ఊహించిన‌ట్లుగా శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు హెడ్‌కోచ్ ప‌ద‌వికి స‌న‌త్ జ‌య‌సూర్య రాజీనామా చేశారు. భార‌త్‌-శ్రీ‌లంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో లంక ప్ర‌యాణం అనూహ్యంగా ముగిసింది. ఈ క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

P

Sports | Published On Mar 9, 2026, 8.31 pm IST

Sri Lanka Cricket | శ్రీ‌లంక హెడ్‌కోచ్ ప‌ద‌వికి జ‌య‌సూర్య రాజీనామా.. టీమిండియా మాజీ కోచ్‌కు బాధ్య‌త‌లు..!
Advertisement

Sri Lanka Cricket | అంద‌రూ ఊహించిన‌ట్లుగా శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు హెడ్‌కోచ్ ప‌ద‌వికి స‌న‌త్ జ‌య‌సూర్య రాజీనామా చేశారు. భార‌త్‌-శ్రీ‌లంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో లంక ప్ర‌యాణం అనూహ్యంగా ముగిసింది. ఈ క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ మేర‌కు శ్రీ‌లంక క్రికెట్ (SLC) సోమవారం అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్, అనుభ‌వం ఉన్న గ్యారీ కిర్‌స్టెన్‌ను హెడ్‌కోచ్‌గా నియ‌మించిన‌ట్లు పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి ప‌ద‌వీకాలం మొద‌లై.. ఏప్రిల్ 14, 2028 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు జ‌ట్టును స‌న్న‌ద్ధం చేయ‌డం గ్యారీకి స‌వాల్‌గా మార‌నున్న‌ది. ఈ టోర్నీ ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ది.

ఏప్రిల్ నుంచి షురూ..

గ్యారీ కిర్‌స్ట‌న్‌కు కోచ్‌గా మంచి అనుభ‌వం ఉంది. ఆయ‌న గ‌తంలో ప‌లు దేశాల జాతీయ జ‌ట్ల‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. 58 సంవ‌త్స‌రాల కిర్‌స్టెన్ 2008–2011 వరకు భారత్ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న హ‌యాంలో భార‌త జ‌ట్టు 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను నెగ్గింది. దాంతో ఆయ‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. 2011–2013 దక్షిణాఫ్రికా జట్టు హెడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలో ప్రొటీస్ జ‌ట్టు మూడు ఫార్మాట్ల‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ స్థాయికి చేరుకుంది. ఇటీవల క్రికెట్ న‌మీబియాకు కన్సల్టెంట్‌గా వ్య‌వ‌హ‌రించారు.

జ‌య‌సూర్య ప‌ద‌వీకాలంలో..

జయసూర్య 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత శ్రీలంక హెడ్ కోచ్ అయ్యారు. ఆయ‌న కోచింగ్ హ‌యాంలో కొన్ని నెలల్లో జట్టు కీల‌క విజ‌యాలు సాధించింది. 2024 ఆగ‌స్టులో భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను గెలిచింది. 27 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ సిరీస్‌ను గెలిచి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అదే ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచినా సిరీస్‌ను కోల్పోయింది. అదే సంవత్సరం న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ 2-0తో గెలిచింది. అయితే, 2025 జ‌ట్టు ఆశించిన మేర రాణించ‌లేక‌పోయింది. ఆసియా క‌ప్‌, పాక్‌తో జ‌రిగిన ట్రై సిరీస్‌లోనూ ప్ర‌ద‌ర్శ‌న మెరుగుప‌డ‌లేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు లంక‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. జ‌య‌సూర్య శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు చీఫ్ సెలెక్ట‌ర్‌తో పాటు హెడ్‌కోచ్‌గా సేవ‌లు అందించారు. కొత్త కోచ్ సార‌థ్యంలోనైనా శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న మారుతోంద‌ని భావిస్తోంది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో క‌ష్టాల్లో ఉన్న ఆ జ‌ట్టును కిర్‌స్టెన్ ఎలా ముందుకు న‌డిపిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement