త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MI Vs DC | స‌మీర్ రిజ్వీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ విక్ట‌రీ..!

MI Vs DC | సమీర్ రిజ్వీ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబ‌యి ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబ‌యి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

P

Sports | Published On Apr 4, 2026, 7.53 pm IST

MI Vs DC | స‌మీర్ రిజ్వీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ విక్ట‌రీ..!
Advertisement

MI Vs DC | సమీర్ రిజ్వీ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబ‌యి ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబ‌యి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ 18.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. సమీర్ రిజ్వీ 90 పరుగుల అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వ‌చ్చిన సమీర్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు.

ఈ మ్యాచ్‌లో సమీర్ బలంగా బ్యాటింగ్ చేసి, డేవిడ్ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి షాక్ త‌గిలింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రిజ్వీని ఢిల్లీ రంగంలోకి దించింది. రిజ్వీ తొలుత పతుమ్ నిస్సంకతో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఆ తర్వాత మిల్లర్‌తో కలిసి జట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. సమీర్ 51 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 90 పరుగులు చేసి తన సెంచరీకి కొద్ది దూరంలోనే అవుటయ్యాడు. ఢిల్లీ తరఫున నిస్సంక 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో, ట్రిస్టన్ స్టబ్స్ మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Advertisement
Advertisement