త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Sharma | ఐసీసీ టోర్నీలో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది.. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ జోస్యం..!

Rohit Sharma | భారత క్రికెట్‌ జట్లు ఐసీసీ టోర్నీల్లో విజయయాత్రను కొనసాగిస్తాయని మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల భారత మెన్స్‌, వుమెన్స్‌ జట్లు అంతర్జాతీయ టోర్నీల్లో వరుసగా విజయాలు సాధిస్తున్నాయని తెలిపారు.

P

Sports | Published On Mar 15, 2026, 10.56 am IST

Rohit Sharma | ఐసీసీ టోర్నీలో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది.. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ జోస్యం..!
Advertisement

Rohit Sharma | భారత క్రికెట్‌ జట్లు ఐసీసీ టోర్నీల్లో విజయయాత్రను కొనసాగిస్తాయని మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల భారత మెన్స్‌, వుమెన్స్‌ జట్లు అంతర్జాతీయ టోర్నీల్లో వరుసగా విజయాలు సాధిస్తున్నాయని తెలిపారు. 2024లో ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను రోహిత్‌ వర్మ నేతృత్వంలోని టీమిండియా మెన్స్‌ జట్టు గెలిచింది. ఆ తర్వాత 2025లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు తొలిసారిగా ఐసీసీ వుమెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ని నెగ్గింది. అదే ఏడాది భారత అండర్‌-19 వుమెన్స్‌ జట్టు ఐసీసీ టీ20 ట్రోఫీని సాధించింది. అదే సంవత్సరం రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకుంది.

రెండు సంవత్సరాల్లో ఆరు ట్రోఫీలు

టీమిండియా విజయాల పరంపర 2026లో కొనసాగింది. భారత అండర్-19 జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి ఐసీసీ అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను నెగ్గింది. అలాగే, కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో సీనియర్ జట్టు రికార్డు మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్‌ శర్మ గత కొన్ని సంవత్సరాల్లో భారత క్రికెట్‌ జట్లు సాధించిన విజయాలను చూస్తే గర్వంగా ఉందన్నారు. మెన్స్‌ జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో మనం చూసిన విజయాలు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించాయన్నారు. మెన్స్‌ జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ప్రపంచకప్ గెలుచుకోవడం నిజంగా గొప్ప విషయమన్నారు.

భారత్‌కు ఇంకా అనేక అంతర్జాతీయ టైటిళ్లు దక్కాల్సి ఉందని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇటీవల పురుష జట్టు చేసిన ప్రదర్శన అసాధారణం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని నేను భావిస్తున్నాను. ఒకసారి జట్టుకు మంచి మొమెంటం దొరికితే అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మెన్స్‌, మహిళా జట్లకు అదే మొమెంటం ఉంది. దీన్ని కొనసాగిస్తామనే నమ్మకం ఉంది’ అని రోహిత్‌ పేర్కొన్నారు. ఈ విజయాల వెనుక క్రీడాకారులతో పాటు పనిచేసే సహాయక సిబ్బందికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘విజయానికి ఎలాంటి రహస్యం లేదు. ఇది కేవలం కష్టపడి చేసిన శ్రమ ఫలితం. మైదానంలో ఆడే ఆటగాళ్లతో పాటు తెర వెనుక పనిచేసే అనేక మంది సిబ్బంది కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు.

Advertisement
Advertisement