Ranji Trophy | చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్.. 67 ఏళ్ల తర్వాత తొలిసారిగా రంజీ ట్రోఫీ కైవసం..!
Ranji Trophy | రంజీల్లో జమ్మూ కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో కర్నాటకపై విజయం సాధించి.. తొలిసారిగా రంజీ ట్రోఫీని నెగ్గింది. 67 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీని గెలిచింది. హుబ్లీ వేదికగా మ్యాచ్‌లో కర్నాటకతో మ్యాచ్ డ్రా చేసుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల ఆధిక్యం కారణంగా జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది.
Ranji Trophy | రంజీల్లో జమ్మూ కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో కర్నాటకపై విజయం సాధించి.. తొలిసారిగా రంజీ ట్రోఫీని నెగ్గింది. 67 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీని గెలిచింది. హుబ్లీ వేదికగా మ్యాచ్‌లో కర్నాటకతో మ్యాచ్ డ్రా చేసుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల ఆధిక్యం కారణంగా జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కశ్మీర్ అద్భుతంగా రాణించింది. శుభమ్ పుండిర్ (117) రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి కశ్మీర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యావత్ హసన్ (88), కనిష్క వధావన్ (70), సాహిల్ లోత్రా (72) సైతం హాఫ్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. కర్నాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కర్నాటక జట్టును కశ్మీర్ బౌలర్లు బెంబేలెత్తించారు. అకిబ్ నబీ దార్ నిప్పులు చెరిగే బంతులతో కర్నాటక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. 54 పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు పడగొట్టాడు.
కర్నాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ జమ్మూ కశ్మీర్ బ్యాట్స్‌మెన్‌ను కర్నాటక బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ అజేయంగా 160 నాటౌట్ పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కశ్మీర్ విజేతగా నిలిచింది.

అభినందలు తెలిపిన జమ్మూ కశ్మీర్ సీఎం
జమ్మూ కశ్మీర్-కర్నాటక మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను చూసేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హుబ్లీకి వచ్చారు. తొలిసారిగా ఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో ఆయన మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి చేరుకున్నారు. విజయం సాధించిన జట్టుకు అభినందనలు తెలిపారు. అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సైతం స్టేడియంలోనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ జట్టుకు ఆయన సైతం అభినందించారు.
జమ్మూ కశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీ 1959–60 సీజన్‌లో పాల్గొన్నది. అప్పటి నుంచి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఈ సీజన్‌కు ముందు జమ్మూ కశ్మీర్ 334 రంజీ మ్యాచులు ఆడింది. ఇందులో 45 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. 1982-83లో ఆర్మీపై సాధించిన తొలి విజయాన్ని నమోదు చేయడానికి వారికి 44 సంవత్సరాలు పట్టింది. 2013-14లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని, నెట్ రన్ రేట్‌లో గోవాను ఓడించింది. పర్వేజ్ రసూల్ నాయకత్వంలో వాంఖడే స్టేడియంలో ముంబయి ఓడించి 2015-16లో జమ్మూ కశ్మీర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీజన్‌లో కోచ్ అజయ్ శర్మ, కెప్టెన్ పరాస్ డోగ్రా నాయకత్వంలో జమ్మూ కశ్మీర్ తొలిసారిగా టైటిల్‌ను గెలిచింది.
https://x.com/Sportskeeda/status/2027668035415544175
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






