IPL 2026 | రాజస్థాన్ కెప్టెన్‌గా పవర్ హిట్టర్.. ఇకనైనా ఆ జట్టు జాతకం మారేనా..?
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వచ్చే సీజన్ నుంచి రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది.
IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వచ్చే సీజన్ నుంచి రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌ను సీఎస్‌కే తీసుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో సామ్ కర్రన్, రవీంద్ర జడేజా ఇద్దరూ రాజస్థాన్ జట్టులోకి వెళ్లారు. గత కొద్ది సంవత్సరాలుగా రియాన్ పరాగ్ రాజస్థాన్ తరఫున స్థిరంగా ఆడుతూ వస్తున్నాడు. గత సీజన్‌లో శాంసన్ గాయం కారణంగా ఆడలేకపోవడంతో జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ర్యాన్ గతంలో సైతం జట్టుకు కెప్టెన్‌గా పని చేశాడు.
2025 సీజన్‌లో శాంసన్ ఎనిమిది మ్యాచులు ఆడలేదు. శాంసన్ గైర్హాజరీలోని ర్యాన్ కెప్టెన్సీ బాధ్యతలను భుజాన వేసుకోగా.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అతని నాయకత్వంలో ఆ జట్టు ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. రాబోయే సీజన్ రాజస్థాన్‌కు భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే జట్టుకు కొత్త కెప్టెన్‌తో పాటు కొత్త కోచ్ నాయకత్వంలో బరిలోకి దిగనున్నది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార సంగక్కర హెడ్‌కోచ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక గత సీజన్‌లో ఆర్ఆర్ జట్టు 14 మ్యాచుల్లో కేవలం నాలుగింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 84 మ్యాచులు ఆడాడు. 2024 సీజన్‌లో బ్యాట్‌తో రాణించాడు. 150 స్ట్రయిక్ రేట్‌తో ఆ సీజన్‌లో 573 రన్స్ చేశాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






