ZIM vs IRE | వర్షంతో మ్యాచ్ రద్దు.. గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా ఇంటికి..! సూపర్ 8లోకి జింబాబ్వే..!
ZIM vs IRE | ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేదని విర్రవీగే ఆస్ట్రేలియా జట్టుకు టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం ఎదురైంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే వైదొలగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటీవల పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు.. శ్రీలంక చేతిలోనూ ఓడిపోయింది.
ZIM vs IRE | ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేదని విర్రవీగే ఆస్ట్రేలియా జట్టుకు టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం ఎదురైంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే వైదొలగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటీవల పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు.. శ్రీలంక చేతిలోనూ ఓడిపోయింది. తాజాగా సూపర్ 8లోకి వెళ్లాలన్న కంగారుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. తొలిసారి 2009లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్-బీలో జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా దరయ్యింది. ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో జింబాబ్వే సూపర్8లోకి ఎంట్రీ ఇచ్చింది.
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి..
గ్రూప్ బీలో శ్రీలంక జట్టు సూపర్ ఎయిట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత జింబాబ్వే సైతం సూపర్ ఎయిట్‌కి అర్హత సాధించింది. జింబాబ్వే తొలుత ఆడిన రెండు మ్యాచులను గెలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచింది. తాజాగా మ్యాచ్ రద్దుకావడంతో ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరింది. మొత్తం మూడు మ్యాచుల్లో కలిపి ఐదు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచి సూపర్ ఎయిట్‌కి అర్హత సాధించింది. అయితే, ఆస్ట్రేలియాకు మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. గెలిచినా కూడా నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో ఆసిస్ ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసిపోయింది. అలాగే, ఐర్లాండ్, ఒమన్ జట్లు సైతం నిష్క్రమించాయి.
ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రయాణం దారుణంగా ఉంది. ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే పసికూన జింబాబ్వే సైతం ఓడించింది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో సైతం ఓటమిపాలు కావడంతో ఇబ్బందికరంగా మారింది. 20న ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లైనా గెలిచి గౌరవ ప్రదంగా టోర్నీకి వీడ్కోలు పకాలని ఆ జట్టు భావిస్తోంది. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోతే.. ఆస్ట్రేలియాకు కొంత వరకు సూపర్ ఎయిట్ అవకాశం ఉండేది. మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. అవుట్ ఫీల్డ్‌లోనూ కవర్లు కప్పే ఉంచారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కటాప్ సమయం సాయంత్రం 6.10 గంటలు. వాతావరణం మెరుగుపడే అవకాశం కనిపించకపోవడంతో కెప్టెన్లతో మాట్లాడిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






