T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ విజయం.. సోషల్ మీడియాలో పోలీసుల సరదా ట్వీట్స్..
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా అభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా అభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల పోలీసులు సైతం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీటర్లు నెటిజన్లు ఆకట్టుకున్నాయి.
ఢిల్లీ పోలీసుల పోస్ట్‌తో..

సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)లో సరదా చర్చ ఢిల్లీ పోలీస్ అఫీషియల్ అకౌంట్ నుంచి మొదలైంది. అహ్మదాబాద్ పోలీస్‌ను ట్యాగ్ చేస్తూ “డియర్ అహ్మదాబాద్ పోలీస్. కివీ అభిమానుల నుంచి ‘బంతులు కనిపించడం లేదు’ అనే ఫిర్యాదులు రావొచ్చు. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా బ్యాటర్లు బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తున్నందుకే అవి కనిపించడం లేదు” అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు దాన్ని పెద్దఎత్తున ట్రెండ్ చేశారు. దీనికి అహ్మదాబాద్ పోలీసులు సైతం అదిరిపోయేలా స్పందించింది. “సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం” అని ట్వీట్ చేసింది. ఈ స్పందన కూడా నెటిజన్లను ఆకట్టుకుంది. పోలీస్ విభాగాల మధ్య జరిగిన ఈ సరదా ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొద్ది సేపటికే ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ ఇందులో చేరింది. “ఇప్పుడది కేవలం బంతులు కనిపించకపోవడం మాత్రమే కాదు. మొత్తం న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా కనిపించడం లేదు. ఇది భారత బౌలర్ల ప్రతిభ కావొచ్చు. మా అంచనా ప్రకారం ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఇది బుమ్రా ప్రభావం” అని ఆ పోస్టులో చమత్కరించింది.

బుమ్రా బౌలింగ్‌కు కివీస్ విలవిల..
ఫైనల్ మ్యాచ్ టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. భారత్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బుమ్రాతో పాటు అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే, ఆతిథ్య దేశంగా స్వదేశంలో ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా రికార్డును నెలకొల్పింది. ఈ విజయంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్‌కప్ గెలిపించిన భారత కెప్టెన్ల జాబితాలో చేరారు. ఇప్పటికే ఆ జాబితాలో కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్రముఖులు ఉన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






