PM Modi | కామన్వెల్త్ పతక విజేతలతో మోదీ.. క్రీడాకారులకు అభినందన..
PM Modi | కామన్వెల్త్ గేమ్స్-2026లో పతకాల పంట పండించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన భారత బృందం సభ్యులతో మోదీ భేటీ అయ్యారు. క్రీడాకారుల ప్రదర్శనను ప్రశంసించిన ప్రధాని.. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు కూడా మోదీతో తమ అనుభవాలను పంచుకున్నారు.
PM Modi | కామన్వెల్త్ గేమ్స్-2026లో పతకాల పంట పండించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన భారత బృందం సభ్యులతో మోదీ భేటీ అయ్యారు. క్రీడాకారుల ప్రదర్శనను ప్రశంసించిన ప్రధాని.. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు కూడా మోదీతో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రధానితో జరిగిన భేటీ తమకు ఎంతో ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా ఉందని పలువురు క్రీడాకారులు పేర్కొన్నారు. క్రీడాకారులతో భేటీకి సంబంధించిన వీడియో రీల్‌ను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఆడే వారే ఎదుగుతారు.. భారత్‌కు ఎప్పుడూ ఉత్సాహంగా మద్దతుగా నిలవండి’ అంటూ క్రీడాకారులకు సందేశం ఇచ్చారు.
39 పతకాలు.. నాలుగో స్థానం
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో గతంతో పోలిస్తే క్రీడాంశాల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారత్‌కు సంప్రదాయంగా బలమైన కొన్ని క్రీడలు కూడా ఈసారి పోటీల్లో లేకపోయాయి. అయినప్పటికీ అందుబాటులో ఉన్న ఈవెంట్లలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి 39 పతకాలను ఖాతాలో వేసుకున్నారు.
జూడోలో తొలిసారి రెండు స్వర్ణాలు
గ్లాస్గోలో భారత క్రీడాకారులు పలు చారిత్రక విజయాలను నమోదు చేశారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా జూడోలో భారత్ రెండు స్వర్ణ పతకాలను సాధించింది. ఈ విజయం భారత జూడోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. పారా అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా.. పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు.
బాక్సింగ్‌లో బంగారు పతకాల జోరు
బాక్సింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత బాక్సర్లు ఏకంగా ఏడు స్వర్ణాలు, మూడు రజత పతకాలు సాధించారు. వెయిట్‌లిఫ్టింగ్, పారా క్రీడల్లోనూ భారత్ గణనీయ విజయాలు నమోదు చేసింది. పోటీల సంఖ్య తగ్గినప్పటికీ.. అందుబాటులో ఉన్న విభాగాల్లో భారత క్రీడాకారులు చూపిన పట్టుదల, ప్రతిభ ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. పతక విజేతలను ప్రధాని మోదీ స్వయంగా కలసి అభినందించడం ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
#WATCH | Delhi: In his reel with the Indian athletes who won medals at the Commonwealth Games 2026, Prime Minister Narendra Modi says, "Jo khelega woh khilega. Always cheer for Bharat..."
(Source: Narendra Modi/'X') https://t.co/0V33lAHuU4 pic.twitter.com/vfFPUUwwlG
— ANI (@ANI) August 9, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR Visits Peddi Sudarshan Reddy Family | 'నేనున్నా'.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్
- ●Allu Arjun | వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా లాంఛ్
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. అదిరిపోయే 10 బిగ్ ఛేంజెస్ ఇవే..!
- ●KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
- ●Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
- ●India Vs Sri Lanka XI | గిల్ వచ్చాడు.. భారత్ గెలిచింది!

KCR Visits Peddi Sudarshan Reddy Family | 'నేనున్నా'.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

Allu Arjun | వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా లాంఛ్

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. అదిరిపోయే 10 బిగ్ ఛేంజెస్ ఇవే..!

KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి





