iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. అదిరిపోయే 10 బిగ్ ఛేంజెస్ ఇవే..!
iPhone 18 Pro | ఐఫోన్ అంటే స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు.. ఓ స్టేటస్ సింబల్! కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. ఆపిల్ అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. డిజైన్, కెమెరా, పనితీరు, ప్రైవసీ, సాఫ్ట్‌వేర్ అనుభవం.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఫోన్‌కు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే కొత్త సిరీస్ ఎప్పుడు వస్తుంది? అందులో ఏం కొత్తగా ఉంటుంది? అనే చర్చ లాంచ్‌కు చాలా రోజుల ముందే మొదలవుతుంది.
iPhone 18 Pro | ఐఫోన్ అంటే స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు.. ఓ స్టేటస్ సింబల్! కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. ఆపిల్ అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. డిజైన్, కెమెరా, పనితీరు, ప్రైవసీ, సాఫ్ట్‌వేర్ అనుభవం.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఫోన్‌కు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే కొత్త సిరీస్ ఎప్పుడు వస్తుంది? అందులో ఏం కొత్తగా ఉంటుంది? అనే చర్చ లాంచ్‌కు చాలా రోజుల ముందే మొదలవుతుంది. ఇప్పుడు అదే ఆసక్తి ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్‌పై కనిపిస్తోంది. ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. కంపెనీ అనుసరించే లాంచ్ టైమ్‌లైన్‌ను బట్టి సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఫోల్డబుల్ ఫోన్..
అంతేకాదు.. తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఆపిల్ పరిచయం చేయొచ్చన్న వార్తలు టెక్ ప్రపంచంలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణ ఐఫోన్ 18, తక్కువ ధరలో లభించే ఐఫోన్ 18ఈ (iPhone 18e), సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ (iPhone Air) మోడల్స్‌ను 2027 ప్రారంభంలో లాంచ్ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో సెప్టెంబర్ ఈవెంట్‌లో ప్రో మోడళ్లపైనే ఆపిల్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు బయటకు వచ్చిన లీకులు, అంచనాలను బట్టి చూస్తే.. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో బ్యాటరీ, చిప్, కెమెరా, డిస్‌ప్లే, కనెక్టివిటీ, డిజైన్‌లో పలు మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని అప్‌గ్రేడ్లు ఈసారి కనిపించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ మార్పులేంటి? తెలుసుకుందాం పదండి..!
పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరగొచ్చని సమాచారం. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దాదాపు 10 శాతం ఎక్కువ సామర్థ్యంతో బ్యాటరీని అందించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఈ-సిమ్ (eSIM) వేరియంట్‌లో 5,425mAh నుంచి 5,567mAh వరకు బ్యాటరీ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ అంటే ఎక్కువ బ్యాకప్ అన్నమాట. అయితే, బ్యాటరీ సామర్థ్యం పెంచడం వల్ల ఫోన్ కాస్త మందంగా, బరువుగా మారే అవకాశం కూడా లేకపోలేదు.
కొత్త A20 Pro చిప్.. మరింత స్పీడ్
ఆపిల్ ప్రతి ఏడాది తన చిప్‌సెట్‌ను మరింత శక్తివంతంగా మారుస్తూ వస్తోంది. ఈసారి ఐఫోన్ 18 ప్రోలో A20 Pro చిప్‌ను తీసుకురావచ్చని ప్రచారం జరుగుతోంది. TSMCకి చెందిన 2nm ప్రాసెస్‌పై ఈ చిప్‌ను తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత 3nm టెక్నాలజీతో పోలిస్తే 2nm ప్రాసెస్ వల్ల పనితీరు పెరగడంతో పాటు బ్యాటరీ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఫోన్ వేగంగా పనిచేయడమే కాకుండా.. అదే సమయంలో బ్యాటరీపై భారం కూడా తగ్గొచ్చు. గేమింగ్, వీడియో ఎడిటింగ్, ఏఐ ఆధారిత పనుల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
కెమెరాలో వెరియబుల్ అపెర్చర్
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో సిరీస్‌లో కెమెరా బిగ్ అప్‌డేట్‌లలో ఒకటిగా మారొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు వెరియబుల్ (Variable Aperture) సదుపాయం తీసుకురావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. లెన్స్‌లోకి ఎంత కాంతి వెళ్లాలనేది కెమెరా నియంత్రించగలగడం. దీంతో పరిస్థితిని బట్టి కాంతిని ఎక్కువగా, తక్కువగా లోపలికి పంపుకోవచ్చు. తక్కువ వెలుతురులో ఫొటోలు తీయడం, పోర్ట్రెయిట్ షాట్లు, డెప్త్ ఎఫెక్ట్ వంటివాటిలో ఇది ఉపయోగపడొచ్చు. ఇదే నిజమైతే.. ఐఫోన్‌లో వెరియబుల్ అపెర్చర్ రావడం ఇదే తొలిసారి కానుంది.
టెలిఫొటో కెమెరాకు మరింత పదును
ప్రో మోడళ్లకే పరిమితమయ్యే టెలిఫోటో కెమెరాలోనూ మార్పులు ఉండొచ్చని సమాచారం. అపెర్చర్‌ను అందించడంతో తక్కువ వెలుతురులో జూమ్ ఫొటోగ్రఫీ మెరుగపడే అవకాశం ఉంది. అంటే దూరంలోని వస్తువులను జూమ్ చేసి తీసే ఫొటోల్లోనూ.. ముఖ్యంగా రాత్రి, తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లోనూ నాణ్యత మెరుగయ్యే అవకాశం ఉందన్నమాట.
చిన్నదవనున్న డైనమిక్ ఐస్‌లాండ్
ఐఫోన్ డిజైన్‌లో ప్రత్యేక గుర్తింపుగా మారిన డైనమిక్ ఐస్‌లాండ్ (Dynamic Island) ఇకపై మరింత చిన్నగా కనిపించొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫేస్ ఐడీకి (Face ID) సంబంధించిన ఫ్లూడ్ ఇన్యుమినేటర్‌ను (Flood Illuminator) డిస్‌ప్లే కిందకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఆపిల్ చేస్తోందని సమాచారం. అదే జరిగితే స్క్రీన్ పైభాగంలోని కటౌట్ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఫలితంగా స్క్రీన్ మరింత క్లీనర్‌గా కనిపించొచ్చు.
ఎల్‌టీపీవో ప్లస్ డిస్‌ప్లే
ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాలు, పో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల స్క్రీన్ కొనసాగొచ్చని తెలుస్తోంది. అయితే డిస్‌ప్లే టెక్నాలజీలో మాత్రం మార్పు రావచ్చని సమాచారం. ఈసారి ఎల్‌టీపీవో ప్లస్ డిస్‌ప్లే (LTPO+ Display) టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌ను కొనసాగిస్తూనే డిస్‌ప్లే బ్యాటరీ వినియోగాన్ని మరింత తగ్గిస్తుందని తెలుస్తోంది. అంటే స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్స్ అనుభవం కొనసాగుతూనే బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడే అవకాశాలున్నాయి.
ఆపిల్ సొంత సీ మోడమ్
సెల్యూలర్ కెనెక్టివిటీ (Cellular Connectivity) విషయంలోనూ ఆపిల్ మరో అడుగు ముందుకు వేయనుందని ప్రచారం జరుగుతోంది. మూడో తరం సొంత సీ2 మోడమ్‌ను ఐఫోన్ 18 ప్రోలో తీసుకురావచ్చని సమాచారం. ఈ మోడెమ్ ద్వారా వేగవంతమైన 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సిగ్నల్ స్థిరత్వం ఉంటుందని తెలుస్తోంది. సెల్యులర్, వైఫై అందుబాటులో లేని ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత 5జీ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించే అంశంపైనా చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ ఐఫోన్ కనెక్టివిటీ విషయంలో మరో అడుగు ముందుకేసినట్టే.
కొత్త N2 వైర్‌లెస్ చిప్
వైర్‌సెల్ కనెక్టివిటీ కోసం (Wireless Connectivity) కోసం కొత్త N2 చిప్‌ను ఆపిల్ తీసుకురావచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న N1 చిప్, వైఫై (Wi-Fi 7), బ్లూటూత్ 6 (Bluetooth 6), పర్సనల్ హాట్‌స్పాట్ (Personal Hotspot), ఎయిర్‌డ్రాప్ (AirDrop) వంటి ఫీచర్లకు ఉపయోగపడుతోంది. N2 Chipతో వైర్‌లెస్ కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ చిప్ ద్వారా అందుబాటులోకి వచ్చే పూర్తి ప్రయోజనాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
కొత్త రంగులు.. కొత్తగా ఫినిషింగ్..
డిజైన్‌లో పూర్తిగా కొత్త రూపానికి వెళ్లకుండా.. ఐఫోన్ 17 ప్రో డిజైన్‌ను కొనసాగిస్తూనే కొత్త రంగులను పరిచయం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డార్క్ చెర్రీ (Dark Cherry), లైట్ బ్లూ (Light Blue) డార్క్ గ్రే (Dark Gray), సిల్వర్ (Silver) రంగులు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మాగ్‌సేఫ్ (MagSafe) చుట్టూ ఉండే సెరామిక్ షీల్డ్ (Ceramic Shield) ప్రాంతంలోనూ మార్పులు చేసి వెనుక భాగానికి మరింత క్లీనర్, ఫ్రాస్టెడ్ ఫినిష్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
కెమెరా కంట్రోల్‌లో మార్పులు..
ఐఫోన్‌లో ఇటీవల వచ్చిన కెమెరా (Camera Control) బటన్‌లోనూ మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టచ్ సెన్సిబిలిటీ (Touch Sensitivity), హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను తీసేసి (Haptic Feedback) ప్రెజర్ బేస్డ్ కంట్రోల్‌కు పరిమితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కెమెరాను యాక్సెస్ చేయడం, ఫొటో తీసే సమయంలో కంట్రోల్స్ ఉపయోగించడం మరింత సింపుల్‌గా మారొచ్చని అంచనా.
ధర ఎంత ఉండొచ్చు..
ఫీచర్లు పెరిగినట్టే ధర కూడా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఐఫోన్ అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళనను కూడా పెంచుతున్నాయి. ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు భారత్‌లో ఏకంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో 200 నుంచి 300 డాలర్ల వరకు ధర పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధరనే రూ.1,54,900 ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ లీకులు, అంచనాలు మాత్రమే. ఎలాంటి ఫీచర్లు, ధరలపై ఇప్పటి వరకు ఆపిల్ స్పందించలేదు. సెప్టెంబర్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
- ●Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
- ●India Vs Sri Lanka XI | గిల్ వచ్చాడు.. భారత్ గెలిచింది!
- ●Bahubali | బాహుబలి ఎటర్నల్ వార్‌లో మెగా హీరో - కన్ఫామ్ చేసిన లావణ్య త్రిపాఠి
- ●GOBARdhan Scheme India | ఇక నుంచి పెండతో తయారుచేసే బయోగ్యాస్‌తో నడవనున్న కార్లు.. కేంద్రం కొత్త స్కీమ్ షురూ
- ●Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

KTR | అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్

India Vs Sri Lanka XI | గిల్ వచ్చాడు.. భారత్ గెలిచింది!

Bahubali | బాహుబలి ఎటర్నల్ వార్‌లో మెగా హీరో - కన్ఫామ్ చేసిన లావణ్య త్రిపాఠి





