త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PCB | టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. ఒక్కో ఆటగాడికి రూ.16 లక్షల జరిమానా..?

PCB | టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయం తీసుకుంది. జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.16 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ తీసుకున్నట్లు సమాచారం.

P

Sports | Published On Mar 2, 2026, 8.25 pm IST

PCB | టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. ఒక్కో ఆటగాడికి రూ.16 లక్షల జరిమానా..?
Advertisement

PCB | టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయం తీసుకుంది. జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.16 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ తీసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ టోర్నీల్లో వరుస వైఫల్యాల నేపథ్యంలో బోర్డు ఉన్నతాధికారులు జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన స‌మ‌యాల్లో భారీ పారితోషికాలు, బోనసులు అందుకుంటే.. లక్ష్యాలను చేరుకోలేకపోతే బాధ్యత కూడా వహించాల్సిందేనని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు సమాచారం.

గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాతే జ‌రిమానా విధించాల‌న్న నిర్ణయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన నఖ్వీ.. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, వ్యూహాల్లో లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 2024 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి సూపర్-8 దశకు చేరుకోవడం కాస్త మెరుగ్గానే అనిపించినా.. అక్కడ మాత్రం జట్టు నిలదొక్కుకోలేకపోయింది. మూడు మ్యాచ్‌లలో ఒక్క విజయంతోనే సూపర్-8లో నిష్క్రమించింది. నెదర్లాండ్స్‌పై కష్టతర విజయం సాధించిన పాకిస్థాన్, భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. సూపర్-8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలవడంతో సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.

సెమీఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉండగా, పాకిస్థాన్ బౌలర్లు 200కిపైగా పరుగులు సమర్పించారు. ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినా అది ఉపయోగపడలేదు. ఈ వైఫల్యంతో కెప్టెన్ స‌ల్మాన్ అఘా, మాజీ కెప్టెన్ బాబ‌ర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జ‌ట్టుగా విఫ‌ల‌మ‌య్యామ‌ని, వ్యక్తిగత ప్రతిభపైనే జట్టు ఆధారపడాల్సి వచ్చిందని సల్మాన్ మ్యాచ్ అనంతరం అంగీకరించాడు. ఇదిలా ఉండగా, సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పాకిస్థాన్ ఆటగాళ్లు నెలవారీ రిటైనర్లు, ఐసీసీ ఆదాయ భాగస్వామ్యంతో ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 2025-26 సైకిల్‌లో ఎవరూ టాప్ ‘ఏ’ కేటగిరీలో లేకపోయినా, ఆర్థిక భద్రత పెరిగింది. పీఎస్ఎల్ ద్వారా సైతం మంచి ఆదాయం వస్తోంది. అయినప్పటికీ, పెరిగిన జీతాలు మైదానంలో మెరుగైన ఫలితాలుగా మారడం లేదనే ఆందోళన బోర్డు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ టోర్నీలో మాత్రం ఫర్హాన్ మాత్రమే నిలకడగా రాణించాడు. 2014లో విరాట్ నెలకొల్పిన ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడుతూ 383 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement